BigTV English
Advertisement

Samantha : అక్కడ వేట మొదలెట్టిన సమంత.. అంత రిస్క్ అవసరమంటావా?

Samantha :  అక్కడ వేట మొదలెట్టిన సమంత.. అంత రిస్క్ అవసరమంటావా?

Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత (samantha ), నాగ చైతన్య ( Naga Chaithanya ) తో విడాకులు తీసుకున్న తర్వాత సోలో లైఫ్ ను లీడ్ చేస్తుంది. మొన్నటివరకు అనారోగ్య సమస్యలతో బాధపడింది. ఇక ఇప్పుడిప్పుడే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. సౌత్ సినిమాలే కాదు.. ఇండియాలోనే మోస్ట్ లీడింగ్ యాక్టర్స్‌లో ఒకరిగా సమంత నిలిచారు. ఇటీవల ఓ పాపులర్ సంస్థ నిర్వహించిన సర్వేలో భారత్‌లో లీడింగ్ ఫిమేల్ స్టార్స్‌లో సమంత నెంబర్‌ వన్‌గా నిలిచి తన స్థాయేంటో చూపించారు. ఈమె ఎప్పుడు తమ సినిమాల్లో చేస్తుందా అని దర్శక నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. అంతగా ఆమె పాపులర్ అయ్యింది. ఇక సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో మాత్రం హైపేర్ యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటుంది. తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


అక్కినేని నాగచైతన్య – శోభితల( Shobhitha) నిశ్చితార్ధం జరగడంతో సమంత పేరు మరోసారి వార్తల్లోకెక్కింది. చైతూ కొత్త తోడు వెతుక్కోవడంతో సామ్ కూడా మరొకరిని పెళ్లాడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఖుషి తర్వాత తెలుగులో ఒక్క ప్రాజెక్టు కు కూడా సైన్ చెయ్యలేదు. కానీ హిందీ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సరదాగా ప్లేసులు చూపించే సామ్ ఇప్పుడు షాకింగ్ డెసిషన్ తీసుకుందని తెలుస్తుంది. లైఫ్ ను రిస్క్ లో పెట్టే పని చేస్తుంది. ఇది మేము అనడం లేదు. సమంత వీడియోను చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

ఆ వీడియోలో రాజస్థాన్‌లోని ప్రఖ్యాత రణథంబోర్ నేషనల్ పార్క్‌లో సమంత చక్కర్లు కొడుతున్నారు. గత నాలుగు రోజులుగా ఆమె అక్కడే ఉన్నారు.. చివరికి దీపావళిని కూడా రణథంబోర్ కోటలోనే జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె పంచుకున్నారు. అందులో పులి, మొసలితో పాటు అరుదైన పక్షులను చూడొచ్చు. ఇవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పులిని చూసినప్పుడు ఎలాంటి అనుభూతి కలిగిందని అందరు సమంతను కామెంట్ల రూపంలో అడుగుతున్నారు.


ఇక కేరీర్ విషయానికొస్తే.. సమంత ఖుషి చివరగా చేసింది. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో కలిసి ఆమె నటించిన సిటాడెల్ హనీ బన్నీ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇక బాలీవుడ్ లో సినిమాలు కూడా చేస్తుందనే టాక్ వినిపిస్తుంది.. ఇక తెలుగులో మళ్లీ సమంత బిజీ అవ్వాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. సమంత లాంటి హీరోయిన్ తెలుగు సినిమాలకు దూరం అవ్వడం ఆమె ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక సామ్ హైదరాబాద్ నుంచి ముంబైకి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే..

 

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×