E-Paper
Advertisement

Samantha: సమంత మళ్లీ సిక్.. అందుకేనా..?

Samantha: సమంత మళ్లీ సిక్.. అందుకేనా..?
Advertisement
samantha

Samantha: సమంత మళ్లీ సిక్ అయ్యారు. శాకుంతలం ప్రమోషన్‌కు డుమ్మా కొట్టారు. సడెన్‌గా అనారోగ్యం పాలవడంతో ఈవెంట్‌కు రాలేకపోతున్నానని ఆమే ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. ఇంతకీ సమంతకు ఏమైంది?

ఇటీవల మయోసైటిస్ బారిన పడింది సామ్. అరుదైన వ్యాధి సోకడంతో బాగా బలహీనపడింది. శరీరంలో రోగనిరోధక శక్తి సన్నగిల్లింది. కొన్నాళ్ల పాటు ఆసుపత్రి, బెడ్‌కే పరిమితమయ్యారు. ఆ తర్వాత క్రమక్రమంగా కోలుకుంటున్నారు. అయితే, ఇప్పటికీ పూర్తి ఫిట్‌నెస్‌కి రాలేకపోతున్నారు.

Advertisement

మయోసైటిస్ నుంచి రిలీఫ్ అయ్యాక మళ్లీ షూటింగ్స్‌ స్టార్ట్ చేశారు. రిలీజ్‌కు రెడీగా ఉన్న శాకుంతలం ప్రమోషన్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలు, అవుట్‌డోర్ ఈవెంట్స్‌తో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు పడింది.

వరుస షెడ్యూల్స్‌ వల్ల తాను అనారోగ్యానికి గురైనట్లు సమంత ట్విటర్‌లో వెల్లడించారు. “ఈ వారం అంతా మీ మధ్య ఉండి.. మా చిత్రాన్ని ప్రమోట్‌ చేస్తూ ప్రేమాభిమానాలను పొందినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. వరుస ప్రమోషన్స్‌, షూటింగ్‌ షెడ్యూల్స్‌ వల్ల దురదృష్టవశాత్తు అనారోగ్యానికి గురయ్యాను. జ్వరం, గొంతునొప్పితో ఇబ్బందిపడుతున్నా”.. అంటూ ట్వీట్ చేశారు సమంత.

Advertisement

గుణశేఖర్‌ దర్శకత్వంలో వస్తున్న శాంకుతలం.. ఏప్రిల్‌ 14న రిలీజ్ కానుంది. శాకుంతలం ప్రమోషన్స్‌.. ‘సిటాడెల్‌’, ‘ఖుషి’ షూట్స్‌తో బిజీగా ఉంటున్నారు సమంత.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×