E-Paper
Advertisement

Samantha – Naga Chaitanya : మెగా మ్యారేజ్ లో చైతు, సమంత .. మాట్లాడుకుంటారా ?

Samantha – Naga Chaitanya : మెగా మ్యారేజ్ లో చైతు, సమంత  ..  మాట్లాడుకుంటారా ?
Advertisement

Samantha – Naga Chaitanya : మెగా వారి పెళ్లి సందడి ఇటలీలో ఘనంగా జరుగుతోంది. ఇటలీలో కాక్ టెల్ పార్టీతో మొదలైన వీరి పెళ్లి హడావిడి మెహందీ, హల్దీ ఫంక్షన్స్ పూర్తిచేసుకుని ఈరోజు పెళ్లి పీటల వరకు వచ్చింది. ఇటలీలో జరుగుతున్న ఈ వివాహానికి కుటుంబ సభ్యులతోపాటు కాకుండా కేవలం కొందరు దగ్గర స్నేహితులు మాత్రమే హాజరవుతున్నారు. మరి ముఖ్యంగా టాలీవుడ్ నుంచి వీరి వివాహానికి చాలా కొద్దిమంది హాజరవుతున్నట్లు తెలుస్తోంది. 

కొన్ని సంవత్సరాలుగా సీక్రెట్ ప్రేమని మెయింటైన్ చేసిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వేదమంత్రాల సాక్షిగా భార్యాభర్తలు కాబోతున్నారు. ఈ వేడుకకు హాజరు కావడానికి హీరో నితిన్ తన కుటుంబంతో పాటు ఇప్పటికే ఇటలీకి తరలి వెళ్లారు. అయితే గతంలో విడిపోయిన ఒక మాజీ జంట ప్రస్తుతం ఈ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నారు. ఆ జంట ఎవరో కారు నాగచైతన్య.. సమంత.

Advertisement

మొదట ప్రేమించి , తర్వాత కలిసి సహజీవనం చేసి.. ఇంట్లో వాళ్ళను ఒప్పించి మరి తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువచ్చారు చైతన్య, సమంత. పెళ్లయిన కొత్తలో వీరి కాపురం టాలీవుడ్ లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు జంట అంటే ఇలా ఉండాలి అని అందరూ అనుకునే లోపే.. పబ్లిక్ గా తమ విడాకులను అనౌన్స్ చేశారు ఈ ఇద్దరు. బెస్ట్ కపుల్స్ ఉండే వీరు అలా విడిపోవడంతో అందరూ నోరెళ్ల బెట్టారు. ఇక అప్పటినుంచి ఇద్దరినీ ఒక దగ్గర చూసిన సందర్భమే లేదు.

అలాంటిది ఇప్పుడు వీరిద్దరూ వరుణ్ తేజ్ పెళ్లిలో ఒకటిగా కనిపించబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాలకు వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి పెళ్లి ముహూర్తం నిశ్చయించడం జరిగింది. మెగా వారి పెళ్లికి హాజరు కావటానికి ఈ మాజీ జంట ఇటలీకి వేరు వేరు ఫ్లైట్స్ లో బయలుదేరారు. అయితే అక్కడికి వెళ్ళాక.. ఒకే ఫంక్షన్ లో కలిసాక.. మాట్లాడుకుంటారా లేక ఎడమొహం పెడ మొహం గానే ఉంటారా అనేది చూడాలి. విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా వీరిద్దరూ కలుస్తూ ఉండడంతో అందరి దృష్టి వీరిపైనే ఉంది. ఇంతకీ అక్కడ వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అన్న విషయం పెళ్లి ఫోటోలు వచ్చాక గాని తెలియదు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×