Big Stories

Samantha: పెద్ద‌మ్మ త‌ల్లి స‌న్నిధిలో స‌మంత.. క‌ల నిజ‌మైంద‌ట‌

Samantha: స్టార్ హీరోయిన్ స‌మంత పిచ్చ హ్యాపీ మూడ్‌లో ఉంది. మ‌న‌సు చిన్న‌పిల్ల‌లాగా ఆనందంలో తేలిపోతుంద‌ని ఆమె చెప్పుకొచ్చింది. డిస్నీ సినిమాలు చూసి ఎంజాయ్ చేసిన తాను.. ఇప్పుడు అలాంటి సినిమాలో పార్ట్ కావ‌టం ఎంతో ఆనందంగా ఉద‌ని చెప్పింది. ఇంత‌కీ ఆ సినిమా ఏదో కాదు.. ‘శాకుంతలం’. ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పౌరాణిక ఈ ప్రేమకథా చిత్రంలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. ఈ విజువల్ వండర్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంత‌లంను రూపొందిస్తున్నారు గుణ శేఖ‌ర్‌. శ్రీ వెంకటేశ్వ‌ర‌క క్రియేష‌న్స్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

సినిమా రిలీజ్ కావటానికి ఒక నెల రోజులు మాత్ర‌మే ఉంది. ‘శాకుంతలం’ ఫ‌స్ట్ కాపీ కూడా సిద్ధ‌మైంది. ఇక మూవీ యూనిట్ ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌కి రంగం సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా ముందుగా హైద‌రాబాద్‌లోని పెద్ద‌మ‌త‌ల్లి ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు. వీరిలో స‌మంత‌, దేవ్ మోహ‌న్‌, గుణ శేఖ‌ర్‌, నీలిమ గుణ ఉన్నారు. ఇక్క‌డ నుంచి పాన్ ఇండియా రేంజ్‌లో ప్ర‌మోష‌న్స్‌లో యూనిట్ ఫుల్ బిజీగా అవుతుంది.

- Advertisement -

3D టెక్నాల‌జీతో విజువ‌ల్ వండ‌ర్‌గా తెలుగు, హిందీ, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో శాకుంత‌లం సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది.సెంట్‌గా సమంత, గుణ శేఖర్, దిల్ రాజు సహా టీమ్ స‌భ్యులంద‌రూ శాకుంత‌లం ఫ‌స్ట్ కాపీని చూసి హ్యాపీగా ఫీల‌య్యారు. స‌మంత, దేవ్ మోహ‌న్ జంట‌గా న‌టించిన శాకుంత‌లం చిత్రంలో డా.ఎం.మోహ‌న్ బాబు, ప్ర‌కాష్‌ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువ‌రాజు భ‌ర‌తుడి పాత్ర‌లో న‌టించ‌టం వ‌న్ ఆఫ్ ది హైలైట్.

ట్రీట్‌మెంట్‌కి రూ.45 ల‌క్ష‌లు అయ్యాయి.. మొత్తం చిరంజీవిగారే ఇచ్చారు

for more updates follow this link:-bigtv

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News