BigTV English

Samantha : ఆ వ్యాఖ్యలు బాధకరమే… కానీ, సామ్‌కి ప్లస్ అయ్యాయా…?

Samantha : ఆ వ్యాఖ్యలు బాధకరమే… కానీ, సామ్‌కి ప్లస్ అయ్యాయా…?

Samantha : తెలంగాణ మంత్రి కొండా సురేఖ సమంతపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో దుమారం రేపుతుంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాజీ మంత్రి కేటీఆర్‌పై సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వివాదంలోకి అక్కినేని ఫ్యామిలీతో సహా సమంత పేరును కూడా లాగారు. నాగచైతన్యకు సమంత విడాకులు ఇవ్వడానికి కారణం కేటీఆర్ అని ఆమె చెప్పడంతో ఈ వాఖ్యలు రాజకీయాలతో పాటుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సంచలనంగా మారాయి. ఇప్పటికే ఈ విషయం టాలీవుడ్ సెలెబ్రేటీలు స్పందించి సమంతకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.. వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అని సినీ తారలు కొండా సురేఖపై మండిపడుతున్నారు. ఇక ఆమె చేసిన వ్యాఖ్యలతో సమంతపై సింపతీ పెరిగిపోయిందని తెలుస్తుంది.. ఈ వార్త పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.


కొండా సురేఖ వల్ల సమంతకు పెరిగిన సింపతీ..

అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్‌ను విమర్శించబోయి సురేఖ టాపిక్‌ను సమంత, చైతూల మీదకు తెచ్చారు.. దీంతో సినీ లోకమంతా సురేఖపై ఫైర్ అవుతున్నారు. ఆమె తన కామెంట్స్‌ను వెనక్కి తీసుకోవాలని అంటున్నారు. మరోవైపు సమంత కూడా తనను రాజకీయాల్లోకి లాగొద్దని కోరింది. సినీ లోకమంతా సామ్ కు అండగా నిలిచారు. దీంతో సామ్ కు సింపతీ బాగా పెరిగిపోయిందని తెలుస్తుంది. సమంత బోల్డ్ పాత్రలు చేయ్యడం వల్లే నాగ్ ఫ్యామిలీ సమంతను దూరం పెట్టారని, అందుకే చైతన్య – సమంత విడాకులు అయ్యాయని అప్పట్లో టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ విమర్శలు తగ్గే అవకాశం ఉంది. విడాకలు సమంత వల్ల కాలేదు అనే థాట్ ఇప్పుడు చాలా మందికి క్రియేట్ అయింది..


సమంత విడాకులకు ఆ ఒక్కటే కారణమా?

శోభిత, నాగ చైతన్యల ఎఫైర్ వల్లే ఆమె వెళ్ళిపోయిందని గతంలో వార్తలు వినిపించాయి. అలాగే బోల్డ్ పాత్రలు చేయడం సమంతకు అలవాటు అయింది.. నాగార్జున ఫ్యామిలీ సంప్రాదయమైనది అందు వల్లే సమంత ను వద్దు అనుకున్నారు అంటూ కూడా టాక్ వచ్చింది.. అందుకే నాగచైతన్య విడాకులు తీసుకున్నారని అప్పటిలో వార్తలు వినిపించాయి. ఇక విడాకుల తర్వాత సామ్ ఫ్యామిలీ మ్యాన్ వంటి వెబ్ సిరీస్‌లలో నటించిన సంగతి తెలిసిందే. వాటిల్లో పలు బోల్డ్ సన్నివేశాల్లో ఆమె యాక్ట్ చేసింది. అందువల్లే ఆమె నుంచి చైతూ విడాకులు తీసుకున్నాడని వార్తలు వచ్చాయి.. వీరిద్దరూ విడిపోవడానికి అసలు కారణమేంటో తెలియలేదు కానీ వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.. మొత్తానికి ఇప్పుడు సమంత మరో సారి వార్తల్లో హైలెట్ అవుతుంది. ప్రస్తుతం సామ్ హిందీ లో మాత్రమే సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. ఇక నాగ చైతన్య ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ శోభిత దూలిపాళ్ళ ను రెండో వివాహం చేసుకోబోతున్నాడు..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×