E-Paper
Advertisement

Saripodhaa Sanivaaram Collections: నాని ‘సరిపోదా శనివారం’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంత వచ్చాయంటే..?

Saripodhaa Sanivaaram Collections: నాని ‘సరిపోదా శనివారం’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంత వచ్చాయంటే..?
Advertisement

Saripodhaa Sanivaaram First Day Collections: హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ బ్లాక్ బస్టర్ హిట్‌లు కొడుతున్నాడు. తాజాగా సరిపోదా శనివారం మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఈ సినిమా ప్రీమియర్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో.. ఫస్ట్ షో నుంచి జోరందుకుంది. అయితే మరి ఫస్ట్ డే ఈ సినిమా ఎంత మేర కలెక్షన్ల రాబట్టిందో ఇప్పుడు చూసేద్దాం.

డిఫరెంట్ జానర్లు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించడంలో నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ ముందుంటాడు. అంతేకాకుండా కథ నచ్చితే కొత్త డైరెక్టర్లు, పాత డైరెక్టర్లు అని తేడా లేకుండా అవకాశాలు ఇస్తుంటాడు. గతేడాది ఇద్దరు కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేసి సూపర్ డూపర్ హిట్లు అందుకున్నాడు. గతేడాది మొదట్లో శ్రీకాంత్ ఓదెలతో ‘దసరా’ మూవీ చేశాడు. ఈ మూవీ కనీ వినీ ఎరుగని రీతిలో దూసుకుపోయింది. ఫస్ట్ నుంచి ఎన్నో అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చాక మరింత హైప్‌తో దుమ్ము దులిపేసింది.

Advertisement

బాక్సాఫీసు వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాని కెరీర్‌లో రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన తొలి సినిమాగా దసరా మూవీ నిలిచింది. దీంతో నాని నమ్మకాన్ని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నిలబెట్టుకున్నాడు. అలాంటి నమ్మకంతోనే నాని మరో కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. ఈ సారి కొత్త దర్శకుడు శౌర్యువ్‌కి అవకాశం ఇచ్చాడు. నాని, శౌర్యువ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘హాయ్ నాన్న’ కూడా భారీ అంచనాలతో విడుదలైంది.

ఈ సినిమా కూడా కనీ వినీ ఎరుగని రీతిలో బాక్సాఫీసు వద్ద పరుగులు పెట్టింది. తండ్రీ కూతుళ్ల బంధంతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. కలెక్షన్లలో కూడా దుమ్ము దులిపేసింది. ఇలా గతేడాది ఇద్దరు కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి మంచి క్లాసికల్ హిట్లు అందుకున్న నాని.. ఈ ఏడాది ప్రేక్షకులను అలరించేందుకు మరో కొత్త జానర్‌ను ఎంచుకున్నాడు.

Advertisement

Also Read: ‘సరిపోదా శనివారం’ మూవీ ఫుల్ రివ్యూ.. నాని హిట్ కొట్టాడా?

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక కొత్త సినిమా చేశాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన ‘అంటే సుందరానికి’ ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. అయితే ఈ సారి దర్శకుడిపై నమ్మకంతో నాని మరో అవకాశాన్ని ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన కొత్త సినిమా ‘సరిపోదా శనివారం’. ఎంతో గ్రాండ్ లెవెల్లో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 29న రిలీజ్ అయింది. ఎన్నో అంచనాలతో ప్రీమియర్స్ పడగా.. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు సినిమా అదిరిపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు.

అదే రెస్పాన్స్‌తో ఫస్ట్ షో ఊపందుకుంది. ఫస్ట్ షో చూసిన ప్రేక్షకాభిమానులు సినిమాపై ప్రశంసలు కురిపించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. దీంతో తొలిరోజు ఈ సినిమా మంచి టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ కూడా ఓ రేంజ్‌లో వచ్చినట్లు తెలుస్తోంది. సరిపోదా శనివారం మూవీ ఫస్ట్ డే దాదాపుగా రూ.9 కోట్ల షేర్‌ని రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.6.5 కోట్ల షేర్ అందుకుంది. అలగే ఆల్ ఓవర్ ఇండియాలో రూ.8.50 కోట్లు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా అబ్బురపరచినట్లు తెలుస్తోంది. దాదాపుగా 1 మిలియన్ మార్క్ రీచ్ అయినట్లు తెలుస్తోంది. ఇలా మొత్తంగా ఈ సినిమాకు రూ.9 కోట్ల షేర్ వచ్చినట్లు సమాచారం. అయితే ఈ కలెక్షన్లు దసరా సినిమా కంటే తక్కువని అంటున్నారు. దసరా సినిమాకు తొలిరోజు రూ.23.50 కోట్లు షేర్ రాగా.. సరిపోదా శనివారం మూవీకి మాత్రం రూ.9 కోట్లే వచ్చాయి. దీనిబట్టి చూస్తే దసరా కంటే సరిపోదా శనివారం వెనకపడిందనే చెప్పాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×