BigTV English

Rehana Begum: సీరియల్ నటి దారుణం.. భర్త ఉండగానే డబ్బుకోసం ఇంకొకరిని.. ?

Rehana Begum: సీరియల్ నటి దారుణం.. భర్త ఉండగానే డబ్బుకోసం ఇంకొకరిని.. ?

Rehana Begum: డబ్బు మనిషిని ఏదైనా చేసేలా చేస్తుంది.విచక్షణ లేకుండా చేస్తోంది. ఏది చేసైనా డబ్బు సంపాదించాలి అనుకునేవారు ఈ కాలంలో ఎక్కువ అవుతున్నారు. దీనివలన మోసాలకు, దారుణాలకు పాల్పడి జైలు పాలవుతున్నారు. ఇది సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి కూడా వర్తిస్తుంది. వారు కూడా డబ్బు కోసం ఎన్నో మోసాలు చేస్తున్నారు. తాజాగా ఒక సీరియల్ నటి.. భర్తకు విడాకులు ఇవ్వకుండా డబ్బు కోసం ఇంకొకరిని పెళ్లి చేసుకొని అతడి దగ్గరనుంచి రూ. 20 లక్షలు లాగింది. ఇక ఈ విషయం తెలిసిన రెండో భర్త ఇప్పుడు తన డబ్బు తనకు ఇప్పించాలని పోలీసుల వద్దకు చేరాడు.


 

రిహానా బేగం ఒక సీరియల్ నటి.  విజయ్ టీవీలో ప్రసారమయ్యే పొన్ని సీరియల్‌లో ఆమె కథానాయకుడి తల్లిగా నటించింది. ఆ తరువాత పాండియన్ స్టోర్స్ సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషించింది. దీని తర్వాత, ఆమె పాండియన్ స్టోర్స్ సీరియల్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ సీరియల్స్ ఆమెకు మంచి గుర్తింపునే తీసుకొచ్చి పెట్టాయి. ఆ సీరియల్స్ చేస్తున్నప్పటికే ఆమెకు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక భర్తతో విడిపోయి ఉంటుందో.. లేక వేరే కారణాల వలనో ఆమె ఒక్కత్తే నివాసం ఉంటుంది. ఆ సమయంలోనే రిహానాకు రాజ్ కన్నన్ నే వ్యాపారవేత్త  పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు.


 

ఇక రిహానా.. తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చానని చెప్పడంతో.. రాజ్ కన్నన్, రిహానాను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత అతని వద్ద నుంచి రెహానా రూ. 20 లక్షలు తీసుకుంది. భార్యనే కదా అని అతను కూడా ఇచ్చేశాడు.  ఇక అంతా సవ్యంగా సాగిపోతుంది అన్న సమయంలో రాజ్ కన్నన్ కు ఒక షాకింగ్ విషయం తెల్సింది. రిహానా.. మొదటి భర్తకు విడాకులు ఇవ్వలేదని, ఇప్పటికీ వారు కలుస్తున్నారని తెలుసుకొని ఆమెను నిలదీయగా.. విడాకులు తీసుకోలేదని తెలిపింది. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న రాజ్ కన్నన్ పూందమల్లి పోలీస్  స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

 

రిహానా బేగం తనను మోసం చేసిందని, మొదటి భర్తతో విడాకులు తీసుకోకుండా తనను రెండో పెళ్లి చేసుకుందని ఫిర్యాదులో రాసాడు. అంతేకాకుండా ఆమె తన దగ్గర నుంచి తీసుకున్న రూ. 20 లక్షలను తిరిగి ఇప్పించాలని, తనను మోసం చేసినందుకు ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు.  ఇక రాజ్ కన్నన్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ఈ సాయంత్రం వారిద్దరిని విచారించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వార్త కోలీవుడ్ లో వైరల్ గా మారింది. ఈ విషయం తెలియడంతో నెటిజన్స్ రిహానా బేగంపై ఫైర్ అవుతున్నారు. డబ్బు కోసం ఇలాంటి పనిచేస్తావా.. ? విడాకులు తీసుకున్నట్లు మోసం చేస్తావా.. ? అంటూ ఏకిపారేస్తున్నారు.

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×