Retro: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya)హీరోగా.. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం రెట్రో (Retro) . కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju) దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీ.. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది మే 1న విడుదలైంది. కానీ డిజాస్టర్ ను చవి చూసింది. అయితే ఇప్పుడు ఈ డిజాస్టర్ మూవీకి ఓటీటీలో ఎక్స్టెన్షన్ ఎపిసోడ్ యాడ్ చేస్తున్నాము అంటూ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు చేసిన కామెంట్లు.. నెటిజన్స్ ట్రోల్స్ కి గురవుతున్నాయి. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
రెట్రో ఓటీటీ వెర్షన్ కి ఎక్స్టెన్షన్..
థియేటర్లలో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న రెట్రో సినిమా మే 31 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలోకి కూడా వచ్చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ లో మరో 40 నిమిషాల సన్నివేశం యాడ్ చేయబోతున్నామంటూ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తెలిపారు. తాజాగా ఆయన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. “నేను ఓటీటీ నెట్ఫ్లిక్స్ వ్యక్తులతో చర్చలు జరుపుతున్నాను. మరో మూడు లేదా నాలుగు నెలల తర్వాత #RETRO EXTENDED వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేలా.. ఇందులో లోతైన భావోద్వేగాలు, వివరణాత్మక యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. ఇక రెట్రోలో నాలుగైదు ఎపిసోడ్లు కూడా ఉన్నాయి. అవి దాదాపు 40 నిమిషాలు ఉంటాయి.. ఇక వీటితో పాటు స్పిరిచ్యువల్, కల్ట్, లాఫ్టర్ యాంగిల్‌లో కూడా కొన్ని సన్నివేశాలు జోడించబోతున్నాం” అంటూ డైరెక్టర్ కామెంట్లు చేశారు.
డైరెక్టర్ కామెంట్స్.. నెటిజన్స్ ట్రోల్స్..
ఈ సినిమా ఓటీటీ వెర్షన్ లో మరో నాలుగు నెలల్లో ఎక్స్టెన్షన్ వెర్షన్ ను విడుదల చేయబోతున్నామని డైరెక్టర్ చెప్పడంతో డిజాస్టర్ మూవీకి మళ్లీ ఎక్స్టెన్షన్ అవసరమా?.. అయిన యాడ్ చేసినంత మాత్రాన ఎవరు చూస్తారు? అంటూ డైరెక్టర్ పై ట్రోల్స్ చేస్తున్నారు..మరి డైరెక్టర్ చెప్పినట్లు రాబోయే ఎక్స్టెన్షన్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.
రెట్రో సినిమా స్టోరీ..
రెట్రో సినిమా స్టోరీ విషయానికి వస్తే.. పారి అలియాస్ పార్వెల్ కన్నన్ (సూర్య) చిన్నప్పుడే పుట్టిన ఊరికి, తల్లిదండ్రులకు దూరం అవుతాడు. ఎవరూ లేని అనాథగా ఉన్న ఇతడిని గ్యాంగ్ స్టార్ తిలక్ తనకి ఇష్టం లేకున్నా.. భార్య కోరిక మేరకు దత్తత తీసుకుంటాడు. ఇక ఓ సందర్భంలో తిలక్ ని శత్రువులు చంపేందుకు ప్రయత్నం చేయగా.. ఆ ప్రమాదం నుంచి పారి అతడిని కాపాడి నిజమైన కొడుకుగా అతడి మనసులో స్థానం సంపాదించుకుంటాడు. అలా తిలక్ నీడలో మరో శక్తివంతమైన గ్యాంగ్స్టర్ గా ఎదుగుతాడు. ఇక అదే సమయంలో రుక్మిణి (Pooja Hegde)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక, హింసాత్మక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకుంటాడు.
ఇక హింసను వదిలేసి భార్యతో సంతోషంగా జీవించాలనుకున్న పారి అనుకున్నది సాధించాడా? అతని గతం ఏంటి ) దాంట్లో దాగున్న రహస్యాలు ఏంటి) అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా కథ ఎంపిక బాగున్నప్పటికీ తెరపై చూపించడంలో డైరెక్టర్ విఫలమయ్యారని వార్తలు కూడా కొంతమంది నుంచి వినిపించాయి. మరి ఇప్పుడు దీనికి వివరణాత్మకంగా ఎక్స్టెన్షన్ చేస్తానని చెబుతున్నారు డైరెక్టర్. మరి ఆ సన్నివేశాలతోనైనా సినిమా మంచి టాక్ తెచ్చుకుంటుందేమో చూడాలి.
also read:HHVM: వీరమల్లు కొత్త డేట్ వచ్చేసింది… ఈ సారైనా మాట తప్పకుండా ఉంటారా ?
"I am in talks with OTT people to release #RETRO EXTENDED VERSION after 3-4 months📺. It has deeper emotion & detailed action scenes. Retro has 4-5 episodes, which will be about 40 mins🤞. There are more details in Spiritual, Cult, Laughter Angle🤝"
– KSpic.twitter.com/wZXeJfFfzj— AmuthaBharathi (@CinemaWithAB) June 17, 2025