Aadhaar Card: ఆధార్ కష్టాలు త్వరలో తీరనున్నాయా? చీటికి మాటికీ ఆధార్ కార్డును బయటకు తీసుకుని వెళ్లాల్సిన అవసరం తప్పనుందా? యూఐడీఏఐ సంస్థ కొత్త యాప్‌కు శ్రీకారం చుట్టిందా? ఇకపై జిరాక్స్ సమస్యలకు ఫుల్‌స్టాప్ పడినట్టేనని అంటున్నారు.
ఆధార్.. ఒకప్పుడు కేవలం గుర్తింపు సంఖ్య మాత్రమే. ఇప్పుడు అన్నింటికీ లింకు పెట్టాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. స్కీమ్‌లు, బ్యాంకు అకౌంట్లు ఇలా ఒక్కటేంటి.. అన్నింటికీ లింకు చేశాయి ప్రభుత్వాలు. ఆధార్ లేకుంటే ఇప్పుడు ఎలాంటి పని జరగని పరిస్థితి నెలకొంది.
ఏదైనా పని కోసం ఆధార్‌తోపాటు జిరాక్స్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇకపై జిరాక్స్‌లకు ఫుల్‌స్టాప్ పెట్టనుంది యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. కొద్ది రోజుల్లో యూఐడీఏఐ సంస్థ మొబైల్ యాప్ తీసుకురానుంది. వినియోగదారులు పూర్తి స్థాయి లేదా మాస్క్‌డ్ ఆధార్‌ను క్యూఆర్ కోడ్ ద్వారా వాటితో పంచుకోవచ్చు.
ఒక్కమాటలో చెప్పాలంటే ఆధార్ దుర్వినియోగం కాకుండా చేయడం అన్నమాట. అన్నట్లు 2011 లో ఆధార్ వ్యవస్థను తీసుకొచ్చింది కేంద్రం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత యాప్‌ని తీసుకొచ్చింది. ఈలోగా ఎంతమంది ఆధార్ మిస్ అయ్యిందో తెలీదు.
ALSO READ: జస్ట్ రూ. 333 పోస్టాఫీసులో డిపాజిట్ చేస్తే చాలు.. పదేళ్లలో డబ్బే డబ్బు
పర్యాటక ప్రాంతాలకు వెళ్లినప్పుడు హోటల్‌లో అద్దెకు తీసుకోవాలన్నా కచ్చితంగా ఆధార్ జిరాక్స్ అడుగుతున్నారు. ఇళ్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాల గురించి చెప్పనక్కర్లేదు. అక్కడ ప్రతీది పేపర్ ఉండాల్సిందే. ఆస్తుల నమోదుకు ఆధార్ జిరాక్స్‌లు కచ్చితంగా ఉండాల్సిందే. భవిష్యత్తులో జిరాక్స్ అవసరం ఉండకపోవచ్చు.
ఆధార్ జిరాక్స్‌లను కొందరు దుర్వినియోగం చేస్తున్న పరిస్థితుల్లో క్యూఆర్ కోడ్ పద్ధతి వల్ల నియంత్రణ ఉంటుందని ఆ సంస్థ మాట. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నకిలీ పత్రాలను పెట్టకుండా చూడవచ్చు. అంతేకాదు రైళ్లలో తనిఖీలకు క్యూఆర్ కోడ్ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు.
ఇకపై ప్రజలు తమ చిరునామా, ఫోన్ నెంబరు, పేరు, పుట్టిన తేదీ వాటిని ఇంటి నుంచే మార్చుకోవచ్చ. ఒక ప్రొటోకాల్‌ను నవంబరులో తీసుకురానుంది యూఐడీఏఐ. కేవలం వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ కోసమే ఎన్‌రోల్ మెంట్ సెంటర్‌కు వెళ్లాలి. ఒకవిధంగా చెప్పాలంటే పేపరు పని భారం తగ్గనుంది.
జనన ధ్రువీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్సు, పాస్‌పోర్టు, పాన్, పీడీఎస్, ఎమ్‌ఎన్‌ఆర్ ఈజీఏ వంటి రికార్డుల నుంచి డేటాను యూఐడీఏఐ తీసుకుంటుంది. విద్యుత్ బిల్లు డేటాబేస్‌ను అనుసంధానం చేయడం ద్వారా అడ్రస్ తనిఖీలను సరళతరం చేయాలని నిర్ణయించింది.
ఐదు నుండి ఏడు సంవత్సరాల వయస్సు పిల్లలు, 15 నుండి 17 ఏళ్ల వయస్సు పిల్లలకు బయో మెట్రిక్ నమోదు చేయడానికి CBSE వంటి పాఠశాలల్లో ప్రత్యేకంగా డ్రైవ్‌లు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. UIDAI రిపోర్టు ప్రకారం మొదటి రౌండ్‌లో ఎనిమిది కోట్లు, రెండవ రౌండ్‌లో పది కోట్ల మంది చిన్నారులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.