E-Paper
Advertisement

Sekhar master: శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం..

Sekhar master: శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం..

Sekhar master: ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. శేఖర్ అన్న భార్య దుర్గ పది రోజుల క్రితం మృతి చెందారు. నేడు ఆమె దశదిన కర్మ కావడంతో శేఖర్ మాస్టర్ వదినమ్మను తలుచుకొని సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యాడు. దుర్గ గత కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతుందని.. ఆరోగ్యం క్షీణించడంతో ఆమె నిన్న మృతి చెందినట్లు తెలుస్తోంది.

“వదినా మేము నిన్ను మిస్సవుతున్నాం వదినా..ఇంత బాధను భరించి ఇంకా బలంగా నిలబడ్డావు.. నువ్వు నాకెంతో ధైర్యాన్ని ఇచ్చావు.. ఎల్లప్పుడూ పాజిటివ్ మైండ్ తో ఎలా ఉండాలో నేర్పావు.. నేను ఇంకా నువ్వు లేవన్న విషయాన్నీ జీర్ణించుకోలేకపోతున్నాను.. ఇప్పుడు నువ్వు మంచి స్థానంలో ఉన్నావని ఆశిస్తున్నాను..నువ్వు ఎల్లప్పుడూ మాతోనే ఉంటావు” అంతో చెప్పుకొచ్చాడు. 11 నెలలుగా ఆమె క్యాన్సర్ తో పోరాడి ప్రాణాలు విడిచిందని శేఖర్ మాస్టర్ కుమార్తె సాహితి సైతం ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది.

” నా ప్రియమైన దుర్గా అమ్మ, మీరు మమ్మల్ని విడిచి 10 రోజులకు పైగా గడిచిందని తలుచుకుంటే.. ఇప్పటికీ నమ్మడం కష్టంగా ఉంది పెద్దమ్మా..మీరు నా పట్ల ఉన్న షరతులు లేని ప్రేమను మార్చలేనిది. మీరు గత 11 నెలలుగా క్యాన్సర్ కారణంగా అన్ని బాధలతో చాలా బలంగా ఉన్నారు… నేను మీతో పెద్దగా వ్యక్తం చేయకపోవచ్చు కానీ, మీ ప్లేస్ ను ఎవరు భర్తీ చేయలేరు. మీరెప్పుడు నా హృదయంలోని ఉంటారు మిస్ యూ పెద్దమ్మ” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు దుర్గ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు కామెంట్స్ పెడుతున్నారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×