E-Paper
Advertisement

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి రొమాంటిక్ సాంగ్…‘ఋషి వ‌నంలోన‌..’

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి రొమాంటిక్ సాంగ్…‘ఋషి వ‌నంలోన‌..’
Advertisement

Shaakuntalam:స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’. ఫిబ్ర‌వ‌రి 17న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం ‘శాకుంతలం’. ప్ర‌తి ఫ్రేమ్‌ను అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించే గుణ శేఖ‌ర్ మ‌రోసారి ‘శాకుంతలం’ వంటి విజువ‌ల్ వండ‌ర్‌తో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అందులో భాగంగా విడుద‌లైన మూవీ ట్రైల‌ర్, ‘మల్లికా మల్లికా..’ సాంగ్ సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్‌ను క్రియేట్ చేశాయి.

ఈ నేప‌థ్యంలో బుధ‌వారం చిత్ర యూనిట్ ‘శాకుంతలం’ సినిమా నుంచి ‘ఋషి వ‌నంలోన‌…’ పాటను విడుద‌ల చేశారు. మెలోడి బ్ర‌హ్మ‌గా పేరున్న మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం అందించటంతో మ‌రోసారి ఆయ‌న త‌న‌దైన శైలిలో అంద‌మై బాణీల‌ను ప‌లికించారు. దుష్యంతుడు, శ‌కుంత‌ల మ‌ధ్య ఉండే ప్రేమ‌ను తెలియ‌జేసే ఈ పాట అంద‌రి హృద‌యాల‌ను ఆక‌ట్టుకుంటోంది.

Advertisement

ఈ పాట‌లో క‌నిపించే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ విజువ‌ల్స్ ప్రేక్ష‌కుల‌ను మైమ‌రిపింప చేస్తుంది. ఈ ఇన్‌టెన్స్ క్యాచీ సాంగ్‌ను సిద్ శ్రీరామ్‌, చిన్మయి ఎంతో శ్రావ్యంగా ఆల‌పించారు. శ్రీమ‌ణి పాట‌ను రాశారు. దేవ్ మోహ‌న్‌, స‌మంత మ‌ధ్య ఉండే కెమిస్ట్రీ ఓ మ్యాజిక్‌ను క్రియేట్ చేసింది. శ్రీ వెంకటేశ్వ‌ర‌క క్రియేష‌న్స్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

YS Jagan – Sirivennela: సీఎం జగన్‌ను కలిసిన సిరివెన్నెల కుటుంబం

Advertisement

Waltair Veerayya: తెలంగాణ‌లో ఫిక్స్ చేసిన ‘వాల్తేరు వీర‌య్య‌’

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×