E-Paper
Advertisement

Dunki Teaser : ఈ దూకుడు ఆపేదెవరు.. దూసుకుపోతున్న డుంకీ డ్రాప్ 1..

Dunki Teaser : ఈ దూకుడు ఆపేదెవరు.. దూసుకుపోతున్న డుంకీ డ్రాప్ 1..
Advertisement
Dunki Teaser

Dunki Teaser : బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీస్ తో దూసుకుపోతున్న బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్. ఈ సంవత్సరం వరుసగా తన మూడో చిత్రం డుంకీ తో బాక్సాఫీస్ పై దండయాత్రకు రెడీ అయ్యాడు ఈ బాద్షా.

షారూక్, హిరానీ కాంబోలో వస్తున్న ఈ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. డిసెంబర్ లో విడుదలవుతున్న ఈ చిత్రం టాలీవుడ్ లో ఏకంగా సలార్ తో ఢీకొట్టబోతుంది. అయితే మొదట సలార్ రిలీజ్ డేట్ విన్నాక ఈ చిత్రం డేట్ మార్చుకుంటారేమో అనుకున్నారు. కానీ షారుక్ మాత్రం తగ్గేదే లేదంటూ అదే టైంకి మూవీ ని బరిలోకి దింపుతున్నాడు.

Advertisement

ఇక రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్ ,త్రీ ఇడియట్స్,పీకే, సంజు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. నెక్స్ట్ షారుక్ తో రాబోయే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మాంచి బజ్ ఉంది. ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన డంకీ డ్రాప్ 1 చిత్రం పై మరింత ఆసక్తి రేపే విధంగా ఉంది. నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ప్రేరణ తో ఈ మూవీ తెరకెక్కించడం జరిగింది. ఒక్క టీజర్ లోనే ఎన్నో భావోద్వేగాలను అద్భుతంగా ప్రదర్శించారు.

చిత్రం రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్ పై భారీగా ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి వచ్చిన మొదటి టీజర్ డుంకీ డ్రాప్ 1.. విడుదలైన అతి కొద్ది సమయంలోనే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ ట్రైలర్ చూసిన ఎవరికైనా మూవీ ఒక ఫ్రెండ్ షిప్ బాండింగ్ తో ముందుకు సాగే లవ్ స్టోరీ అని అర్థం అవుతుంది. ఎప్పటికైనా విదేశానికి వెళ్లాలి అనుకునే వారి ఆశ, దానికోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు తమాషాగా ఉంటాయి.

Advertisement

ఇక ఈ వీడియో స్టార్టింగ్ లో ఎండిపోయిన ఒక ఎడారి.. నల్లని దుస్తులతో ఎడారి దాటడానికి ప్రయత్నిస్తున్న షారుక్ అండ్ టీమ్.. వెనక జరిగే ఒక గన్ ఫైర్.. ఇలా ఎంతో ఆసక్తిగా మొదలుపెట్టారు. ఈ ఆసక్తికరమైన వీడియో విడుదలైన 24 గంటలలోనే 72 మిలియన్ల వ్యూస్ సంపాదించి ఈ ఇయర్ అత్యధికంగా వీక్షించిన టీజర్లలో ఒకటిగా నిలిచింది.ఈ టీజర్ లో బోమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్, షారుఖ్ ఖాన్‌ మధ్య జరిగే కొని ఇన్సిడెంట్స్ హై లైట్ చేశారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×