E-Paper
Advertisement

Shah Rukh Khan : మలబద్ధకానికి మందులు ఇస్తా.. వైరల్ అవుతున్న షారుక్ కౌంటర్ ..

Shah Rukh Khan : మలబద్ధకానికి మందులు ఇస్తా.. వైరల్ అవుతున్న షారుక్ కౌంటర్ ..
Advertisement
Shah Rukh Khan

Shah Rukh Khan : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. ఈ సంవత్సరం రెండు భారీ చిత్రాలతో బాక్స్ ఆఫీసును షేక్ చేసిన ఈ స్టార్ హీరో ముచ్చటగా మూడవ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వినూత్నమైన కాన్సెప్ట్ తో ముందుకొస్తున్న డంకీ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. తెలుగులో కూడా విడుదలవుతుంది అనుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతానికి ఎటు తేలకుండా ఉంది. అయితే హిందీ వర్షన్ మాత్రం డిసెంబర్ 21న థియేటర్లలో విడుదలవుతోంది. ఇటు ప్రభాస్ సలార్ మూవీ డిసెంబర్ 22న తెలుగుతోపాటు బాలీవుడ్ లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టే దిశగా విడుదల అవుతుంది.

ప్రస్తుతం ప్రభాస్ కు బాలీవుడ్ లో కూడా మార్కెట్ వాల్యూ బాగానే ఉంది. సాహో మూవీ తెలుగులో పెద్దగా ఆడకపోయినా హిందీలో కలెక్షన్స్ బాగానే రాబట్టడం దీనికి నిదర్శనం. ఆదిపురుష్ మూవీతో కాస్త నిరాశ పడ్డ ప్రభాస్ సలార్ మూవీతో ఈ సంవత్సరం మంచి సక్సెస్ అందుకోవాలి అని అతని అభిమానులు ఆశిస్తుంటే.. రెండు గిట్ల అందుకున్న షారు డంకీ మూవీ తో హ్యాట్రిక్ కొట్టాలి అని అతని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం రిలీజ్ కి ముందు స్టార్ హీరోలు అభిమానులతో ముచ్చటించడం బాగా ట్రెండింగ్ గా ఉంది. ఈ నేపథ్యంలో షారుక్ కూడా తన మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా అభిమానులతో ముచ్చటించారు. అయితే ఇది జరిగేటప్పుడు షారుక్ కి చిర్రెత్తుకొచ్చే ప్రశ్నను వేసారొక‌రు. దీనికి షారుక్ తన రేంజ్ కౌంటర్ ఇవ్వడంతో అందరూ అవాక్కయ్యారు. ఇంతకీ సంగతి ఏంటంటే.. ఇంతకుముందు వచ్చిన మీ ప‌ఠాన్..జ‌వాన్ చిత్రాల సక్సెస్ లో మీ పిఆర్ టీం కృషి ఉంది అని అందరూ అంటున్నారు. మరి డంకీ చిత్రంలో కూడా వారి ఎఫర్ట్స్ పలిస్తాయా ..అని అడగడంతో షారుక్ కి కాస్త కోపం వచ్చింది.

ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నకు జవాబుగా.. “మీలాంటి తెలివైన వారికి నేను సమాధానం చెప్పను.. కానీ మీరు ఇందుకు మినహాయింపు. మీరు మలబద్ధకంతో బాధపడుతున్నారని నాకు అర్థం అవుతోంది. మా పి ఆర్ టీం కి చెప్పి మీకు మలబద్ధకం తగ్గేదానికి మందులు కూడా పంపిస్తాను . మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను..”అంటూ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం షారుక్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు అలాంటి వాళ్లకు అలాగే బుద్ధి చెప్పాలి అని చాలామంది స్పందిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×