E-Paper
Advertisement

Shankar Daughter: దర్శకుడు శంకర్‌ కుమార్తెకు రెండో వివాహం.. ఆ అసిస్టెంట్ డైరెక్టరే వరుడు

Shankar Daughter: దర్శకుడు శంకర్‌ కుమార్తెకు రెండో వివాహం.. ఆ అసిస్టెంట్ డైరెక్టరే వరుడు
Advertisement

Director Shankar daughter Second Marriage: ప్రముఖ దర్శకుడు శంకర్‌ ఇంట సందడి నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య (aishwarya shankar), అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తరుణ్‌ కార్తీక్‌ ల నిశ్చితార్థం చెన్నైలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథులు హాజరయ్యారు. వేడుకకు సంబంధిత ఫొటోలను ఐశ్వర్య సోదరి, నటి అదితి శంకర్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘ప్రపంచంలో నాకు బాగా ఇష్టమైన ఇద్దరు వ్యక్తులతో నేను.. మరిచిపోలేని రోజు ఇది’ అని తన సోదరి, సోదరుడు అర్జిత్‌ను ఉద్దేశించి క్యాప్షన్ పెట్టారు.

వైద్యురాలైన ఐశ్వర్యకు ఇది రెండో వివాహం. 2021లో క్రికెటర్‌ రోహిత్‌ను పెళ్లి చేసుకున్నారు. తర్వాత అతనితో విడాకులు తీసుకున్నారు. అప్పట్లో రోహిత్‌పై వచ్చిన ఆరోపణలు కారణంగానే ఆమె విడిపోయినట్లు కోలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం సాగింది. అయితే ప్రస్తుతం తరుణ్‌ కార్తీక్‌.. శంకర్‌ సినిమాలకూ సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నారు.

Advertisement

శంకర్‌ ప్రస్తుతం రెండు పాన్‌ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు 2’ రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘విరుమన్‌’తో 2022లో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన అదితి ఆ తర్వాత ‘మావీరన్‌’లో నటించారు. విష్ణు వర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నారు. అదితి మంచి సింగర్‌ కూడా రాణించారు. తాను నటించిన సినిమాల్లోని కొన్ని పాటలే కాకుండా వరుణ్‌ తేజ్‌ హీరోగా తెలుగులో తెరకెక్కిన ‘గని’లోని ‘రోమియో జూలియట్‌లా’ సాంగ్‌ ఆలపించి అలరించారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×