E-Paper
Advertisement

Sharukh Khan: చివరి కోరిక బయటపెట్టిన షారుక్.. కంగారులో ఫ్యాన్స్..!

Sharukh Khan: చివరి కోరిక బయటపెట్టిన షారుక్.. కంగారులో ఫ్యాన్స్..!
Advertisement

Sharukh Khan.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాద్ షా గా పేరు సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్ (Sharukh Khan) అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా గత కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన రీ ఎంట్రీ లో కూడా వరుస విజయాలు అందుకుంటూ తన స్టామినా నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా పఠాన్, జవాన్, డంకీ వంటి చిత్రాలతో వరుసగా హ్యాట్రిక్ అందుకున్నారు షారుక్ ఖాన్. అంతేకాదు ఇటీవలే ప్రపంచంలో అత్యంత అందగాళ్ళ జాబితాలో పదవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కింగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

నా చివరి కోరిక అదే.. అక్కడే చనిపోవాలి..

Advertisement

తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు షారుక్ ఖాన్. జీవితాంతం ఇండస్ట్రీలోనే ఉంటారా? లేక వేరే రంగంలోకి వెళ్తారా? అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి షారుక్ ఖాన్ స్పందిస్తూ.. చనిపోయే వరకు నేను సినిమాల్లోనే ఉంటాను. అంతేకాదు నేను ఏదైనా సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు యాక్షన్ అని చెప్పగానే చనిపోవాలి.. మళ్లీ వాళ్ళు కట్ చెప్పినా సరే నేను లేవకూడదు. అదే నా చివరి కోరిక. ఎప్పుడు నేను దేవుడిని అదే ప్రార్థిస్తాను. సినిమా షూటింగ్లో నటిస్తున్నప్పుడే నా ప్రాణాలు తీసుకో అని నేను కోరుతాను అంటూ సరదాగా చెప్పుకొచ్చారు షారుక్ ఖాన్. దీన్ని బట్టి చూస్తే సినిమా పై ఆయనకున్న ప్యాషన్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది.

సెన్సాఫ్ హ్యూమర్ ఉండకూడదు..

Advertisement

అయితే సినిమా షూటింగ్లో ఉన్నప్పుడే తాను చనిపోవాలి అన్న తన చివరి కోరిక విని అభిమానులు కంగారుపడుతున్నారు. తన అభిమాన హీరోకి ఇలాంటి చావు రాకూడదు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కో విధంగా ఉంటుందంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక అలాగే స్టార్డం గురించి కూడా షారుక్ ఖాన్ మాట్లాడుతూ.. నాకొచ్చిన స్టార్ డంను నేను గౌరవిస్తాను.. కానీ దానికి పెద్దగా ప్రాధాన్యత అయితే ఇవ్వను. ముఖ్యంగా అభిమానుల ప్రేమ, ఆదరణ, గుర్తింపు, డబ్బులు వస్తాయి కదా అందుకు నా కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. అయితే నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే అని నేను అనుకుంటాను. నా జోకులతో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించగలరు కానీ వారికి అర్థమవుతాయో లేదో నాకు తెలియదు. దానికి కారణం ఏమిటంటే ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో చాలామంది ఎంతో సున్నితంగా ఉన్నారు. మనం జోక్ చేసినా సీరియస్ గా తీసుకుంటున్నారు. కొంతమంది డిస్టర్బ్ అవుతున్నారు కూడా.. కాబట్టి ఆ ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతేనే బెటర్ అని తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న విధివిధానాలపై ఆయన ఆలోచించిన తీరుకి ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. ఏది ఏమైనా షారుక్ ఖాన్ ప్రస్తుత ఆలోచనలు ట్రెండుకు తగ్గట్టుగా మారుతుండడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×