Shashtipoorthi: టాలీవుడ్ నటకిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం షష్టిపూర్తి. పవన్ ప్రభా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. రూపేష్ అక్షయ్ సింగ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. సినిమాకు ఉన్న మరో ప్రత్యేకత మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా సినిమా టీజర్ ను ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా చేతుల మీదగా విడుదల చేశారు మూవీ టీం. ఇప్పుడు ఆ విశేషాలు చూద్దాం..
కుటుంబ కథ ..
తెలుగుతనం ఉట్టి పడేలా ఉండే ఈ సినిమా ను రూపేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన హీరోగాను నటిస్తున్నారు. కుటుంబ బంధాలు విలువలు నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ లో స్టార్టింగ్ లో మీ అమ్మానాన్నల పెళ్లి మీరు చూడలేరేమో కానీ, షష్టిపూర్తి మీరు చూడొచ్చు అనే బ్యాగ్రౌండ్ స్కోర్ తో హీరోని చూపిస్తారు. ఆ తరువాత అర్చన, రాజేంద్రప్రసాద్ ఇద్దరూ కలుసుకున్న సీన్స్ ని చూపిస్తారు. అర్చన నన్ను అతను ప్రేమిస్తున్నాడు అని తన ఫ్రెండ్స్ తో చెప్పడం వారు రాజేంద్రప్రసాద్ ని ఉద్దేశించి.. రేషన్ షాప్ లో పనిచేసే అబ్బాయా అని అడగడం వారిద్దరి పెళ్లి, ఆ తరువాత వారికి ఒక బాబు పుట్టడం, తర్వాత హీరో షాట్ ని చూపిస్తారు. ఎవరైనా ధైర్యం కోసం ఏం చేస్తారు అని హీరో అడగడం.. అక్కడున్నవారు దేవుడికి దండం పెట్టుకుంటాం అని చెప్పడం, హీరో నేనైతే నీటిలో దూకుతాను అని, షార్ట్ కట్ చేస్తే హీరో పెద్ద లాయర్ గా ఎంట్రీ ఇస్తాడు. రౌడీలతో కొన్ని యాక్షన్ సీన్స్. సరిగ్గా లేని వ్యవస్థను సరి చేయడం నా బాధ్యత అని హీరో డైలాగ్ ఆ తర్వాత కొన్ని సీన్స్, లాస్ట్ లో రాజేంద్రప్రసాద్ హీరో తో, ఒకప్పుడు నిన్ను చూసి పారిపోయిన వాళ్లు ఇప్పుడు నిన్ను పొగుడుతుంటే చాలా సంతోషంగా ఉంది. అనే డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది. ఈ టీజర్ చూసినవారు రాజేంద్రప్రసాద్ లాస్ట్ డైలాగ్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
లేడీస్ టైలర్..మళ్ళి రిపీట్ ..
లేడీస్ టైలర్ చిత్రంలో కనిపించిన రాజేంద్రప్రసాద్, అర్చన మళ్లీ 37 సంవత్సరాల తర్వాత ‘షష్టిపూర్తి’ అనే సినిమాలో నటిస్తున్నారు. అప్పట్లో లేడీస్ టైలర్ సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే జంట మరోసారి షష్టిపూర్తితో మన ముందుకు రానున్నారు. రాజేంద్రప్రసాద్ చేసే ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టుగా నిలుస్తుంది. హీరోకి తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్ జీవించాడని చెప్పొచ్చు. ఈ సినిమాలోనూ హీరోకి తండ్రి పాత్రలోనే నటిస్తున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్లో మరో బిగ్గెస్ట్ హిట్గా నిలవాలని కోరుకుందాం.