OTT Movie : బాలీవుడ్ నుంచి అదిరిపోయే ఒక మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో విద్యా బాలన్ సీబీఐ పాత్రలో, తన నటనతో మరోసారి మెప్పించింది. ఈ మూవీ చివరివరకూ ట్విస్ట్ లతో అదరగొడుతుంది. దీని పేరు ఏమి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘నీయత్’ (Neeyat). 2023 లో విడుదలైన ఈ మూవీకి అను మీనన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటించగా, రామ్ కపూర్, రాహుల్ బోస్, నీరజ్ కబీ, షహనా గోస్వామి, అమృతా పూరి, శశాంక్ అరోరా వంటి నటీనటులు మిగతా పాత్రల్లో నటించారు. ఈ సినిమా అప్పుల్లో కూరుకుపోయిన ఒక ధనవంతుడి మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ సెప్టెంబర్ 1, 2023 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది
స్టోరీలోకి వెళితే
అశిష్ కపూర్ ఒక ధనవంతుడైన భారతీయ వ్యాపారవేత్త గా ఉంటాడు. అయితే అతని కంపెనీలో 20,000 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. జైలు శిక్ష నుండి తప్పించుకోవడానికి భారతదేశం నుండి స్కాట్లాండ్ కి పారిపోతాడు. అతని కంపెనీలో చాలా మంది ఉద్యోగులు, రెండు సంవత్సరాలుగా జీతాలు కూడా పొందకుండా ఉంటారు. ఈ కారణంగా ఆర్థిక సమస్యలతో, ఏడుగురు ఆత్మహత్య చేసుకుంటారు. అశిష్ తన పుట్టినరోజు వేడుక కోసం తన సన్నిహిత మిత్రులు, కుటుంబ సభ్యులను స్కాట్లాండ్ కు ఆహ్వానిస్తాడు. అతిథులలో అతని సెక్రటరీ, గర్ల్‌ఫ్రెండ్ లెసా, కొడుకు ర్యాన్, మరి కొంతమంది ఉంటారు. అయితే ఈ వేడుకకు ఊహించని అతిథిగా సీబీఐ అధికారి మీరా రావు (విద్యా బాలన్) హాజరవుతుంది. అశిష్‌ను అరెస్ట్ చేయడానికే అక్కడికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ వేడుక సమయంలో ఒక భయంకరమైన తుఫాను కారణంగా, అక్కడ ఉండే భవంతిలో బయటకు వెళ్లే అన్ని మార్గాలు మూసుకుపోతాయి. అక్కడ ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు.
అశిష్ తన అతిథులతో ఒక షాకింగ్ ప్రకటన చేస్తాడు. అతను భారత ప్రభుత్వానికి లొంగిపోవాలని ప్రకటిస్తాడు. తన ఆస్తులను అప్పగించి, మోసం కేసులో కోర్టు విచారణను ఎదుర్కోవాలని భావిస్తాడు. ఈ ప్రకటన అతిథులలో కలవరం సృష్టిస్తుంది. ఎందుకంటే అతని నిర్ణయం వారి జీవితాలను కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ఒక వాగ్వాదం తర్వాత అశిష్ భవంతి నుండి బయటకు వెళ్లి చనిపోయి కనిపిస్తాడు. ఇది చూసి అందరూ షాక్ అవుతారు. సముద్రం పక్కన ఉన్న ఒక ఎత్తైన ప్రదేశం నుండి కిందపడి మరణించాడని అందరూ భావిస్తారు. అతను ఆత్మహత్య చేసుకున్నట్లు కొంతమంది అనుకుంటారు. కానీ మీరా రావు దీనిని హత్యగా భావించి విచారణ ప్రారంభిస్తుంది. ఆమె అతిథుల గదులను తనిఖీ చేస్తూ, వారిని విచారిస్తూ, ఒక్కొక్కరికి అశిష్‌ను చంపడానికి ఒక ఉద్దేశం ఉందని తెలుసుకుంటుంది. ఈ క్రమంలో మరిన్ని హత్యలు జరుగుతాయి. చివరికి మీరా రావు ఈ మర్డర్ మిస్టరీని బయట పెడుతుందా ? అశిష్ నిజంగానే చనిపోతాడా ? మరికొన్ని హత్యలు ఎందుకు జరుగుతాయి ? ఈ విషయాలను తెలుసుకోవాలంటే, ఈ మూవీని చూడాల్సిందే.
Read Also : రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయే అన్నా చెల్లెలు … క్రేజీ రొమాంటిక్ మూవీ