E-Paper
Advertisement

Shiva Karthikeyan : తెలుగు స్టార్‌ను ఫాలో అవుతున్న తమిళ హీరో..

Shiva Karthikeyan : తెలుగు స్టార్‌ను ఫాలో అవుతున్న తమిళ హీరో..
Advertisement
Shiva Karthikeyan : తెలుగు స్టార్‌ను ఫాలో అవుతున్న తమిళ హీరో..

Shiva Karthikeyan : సినీ పరిశ్రమలోని హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాదు.. ఇతర నటీనటులు కూడా సినిమాల్లో నటించడంతో పాటు ఇతర బిజినెస్‌లలో కూడా యక్టివ్‌గా ఉంటారు. తెలుగులో స్టార్ హీరోలు సైతం ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు బిజినెస్‌లలో లాభాలు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఐకాన్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్.. థియేటర్ బిజినెస్‌లోకి దిగాడు. ఇప్పుడు ఒక తమిళ హీరో కూడా అల్లు అర్జున్‌నే ఫాలో అవుతూ చెన్నై మల్టీప్లెక్స్ కట్టించడానికి సిద్ధమవుతున్నాడు.

శివకార్తికేయన్.. తమిళంలో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన అతి తక్కువమందిలలో తాను కూడా ఒకరు. ఒక సాధారణ యాంకర్‌లాగా తన కెరీర్‌ను ప్రారంభించిన శివకార్తికేయన్.. కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులను చూశాడు. పలు సినిమాల్లో నటించిన తర్వాత ‘రెమో’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు. అప్పటినుండి తన ప్రతీ సినిమా తెలుగులోకి కూడా డబ్ అవ్వడం ప్రారంభమయ్యింది. తనను తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరించడం మొదలుపెట్టారు.

శివకార్తికేయన్ హీరోగానే కాకుండా లిరిసిస్ట్‌గా, సింగర్‌గా, నిర్మాత కూడా తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. కానీ ఇతర బిజినెస్‌లపై తానెప్పుడూ దృష్టిపెట్టలేదు. ఎక్కువగా తన జీవితంలో సినిమానే నిండిపోయింది. కానీ ఇప్పుడు థియేటర్ బిజినెస్‌లోకి దిగాలని ఆశపడుతున్నాడట ఈ హీరో. ఇప్పటికే ఏషియన్ సినిమాస్‌తో పెద్ద పెద్ద స్టార్లు సైతం చేతులు కలిపారు. మహేశ్ బాబు, అల్లు అర్జున్.. తమ సొంత థియేటర్లను ప్రారంభించారు. శివకార్తికేయన్ కూడా ఇప్పుడు అదే చేయనున్నాడు.

ఏఎస్‌కే (ఏషియన్ శివకార్తికేయన్ సినిమాస్) పేరుతో చెన్నైలో ఒక మల్టీప్లెక్స్ నిర్మాణం జరగనుంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఏ హీరో కూడా ఇంకా ఈ థియేటర్ బిజినెస్‌లోకి దిగలేదు. అందుకే ఈ సాహసం చేస్తున్న మొదటి వ్యక్తిగా శివకార్తికేయన్ ముందుకొచ్చాడు. ప్రస్తుతం ‘మావీరన్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఈ హీరో సిద్ధంగా ఉన్నాడు. ముందుగా ఈ మూవీ రిలీజ్ ఆగస్ట్‌లో ఉందని ప్రకటించినా.. జులైకు ప్రీపోన్ చేశారు. ఇక శివకార్తికేయన్ తర్వాత మరెందరో తమిళ హీరోలు కూడా ఈ థియేటర్ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతారని ప్రేక్షకులు భావిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×