E-Paper
Advertisement

Shobhitha dulipala: సాంప్రదాయంగా పెళ్లి పనులు షురూ.. నాటి కాలాలను గుర్తుచేసిన శోభిత..!

Shobhitha dulipala: సాంప్రదాయంగా పెళ్లి పనులు షురూ.. నాటి కాలాలను గుర్తుచేసిన శోభిత..!
Advertisement

Shobhitha dulipala..సాధారణంగా పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని పెద్దలు చెబుతారు. అలా ఇద్దరు వ్యక్తులను పెళ్లి అనే బంధంతో ఒక్కటి చేయాలి అంటే అది ఎంత గొప్ప కార్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఆ కాలంలో పెళ్లి అనగానే ఐదు రోజులపాటు చాలా ఘనంగా నిర్వహించేవారు. పిల్ల పెద్ద ఇరుగుపొరుగు , బంధువులు, స్నేహితులు ఇలా అందరూ ఐదు రోజులపాటు ఒకే చోట చేరి పెళ్లి పనుల్లో భాగం పంచుకొని, ఆ పెళ్లి వేడుకను విజయవంతం చేస్తారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు అనగానే రెండు రోజుల్లోనే జరిగిపోతుంటే.. ఇంకొంతమంది అయితే చాలా సింపుల్గా వివాహాలు చేసుకుంటున్నారు. నిజానికీ జీవితాంతం గుర్తిండిపోయే ఈ పెళ్లి వేడుకలు అందరికీ కూడా ఆదర్శంగా నిలవాలి. ఇప్పుడు అలాంటి పద్ధతినే మళ్లీ మనకు కళ్ళకు కట్టినట్టు చూపించింది అక్కినేని కాబోయే కోడలు శోభిత ధూళిపాళ.

నిశ్చితార్థం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచిన శోభిత – చైతూ..

Advertisement

తాజాగా శోభితా ధూళిపాళ (Shobitha dhulipala) అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) ను వివాహం చేసుకోబోతోంది. ఆగస్టు 8వ తేదీ అక్కినేని హీరో నాగచైతన్య తో ప్రేమలో పడి నిశ్చితార్థం చేసుకుని తమ ప్రేమ విషయాన్ని అందరికీ ప్రకటించారు ఈ జంట. ముఖ్యంగా నాగచైతన్య, శోభిత ఇద్దరు కూడా తమ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. ఇక త్వరలోనే వీరి వివాహం చేసుకుంటారని అందరూ అనుకోగా డిసెంబర్లో వీరి వివాహం జరుగుతుందని అయితే పెళ్లికి కాస్త సమయం తీసుకుంటామని కూడా నాగార్జున నాడు ప్రకటించారు. కానీ ఇప్పుడు శోభిత షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే అక్కినేని ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

పెళ్లి పనుల్లో నిమగ్నమైన శోభిత..

Advertisement

పెళ్లి పనుల్లో భాగంగా వినాయక పూజను ప్రారంభించిన శోభిత ధూళిపాళ ఆ తర్వాత పసుపు దంచడం, విసరళ్ళు తిప్పడం, బంధుమిత్రులతో అట్టహాసంగా ఈ కార్యక్రమాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పెళ్లికూతురు గెటప్ లో శోభిత చాలా సాంప్రదాయంగా కనిపించింది దీనికి తోడు పెద్దవారి ఆశీర్వాదం తీసుకుంటూ చూడముచ్చటగా అనిపించింది. ఎంతైనా తెనాలి అమ్మాయి కదా మన తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలా అందరినీ అలరిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.. ఏది ఏమైనా శోభిత పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండడం చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అక్కినేని అభిమానులు కూడా ఇటు శోభిత ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి అటు అక్కినేని ఇంట్లో పెళ్లి పనుల సంగతి ఏంటి అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

నాగచైతన్య వ్యక్తిగత జీవితం..

ఇక నాగచైతన్య విషయానికి వస్తే.. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈయన ఆమెతో ఎక్కువ కాలం ఉండలేక వివాహమైన నాలుగేళ్లకే విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత ఏడాది శోభిత ప్రేమలో పడ్డారు.. ఆమెతో రహస్య ప్రేమాయణం నడిపిన ఈయన, ఈ ఏడాది ఎంగేజ్మెంట్ చేసుకొని తమ బంధాన్ని అధికారికం చేశారు. ఇప్పుడు ఈ జంట త్వరలోనే వివాహం చేసుకోబోతోందని శోభిత షేర్ చేసిన ఫోటోలు చూస్తే అర్థమవుతుంది.. ఇకపోతే పెళ్లి తేదీని మాత్రం ఇటు శోభిత అటు అక్కినేని కుటుంబం ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం శోభిత షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ శోభిత నాటి కాలాలను గుర్తు చేసింది అంటూ కామెంట్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×