Shobhitha Dulipala : తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. మొదటి తరం హీరోల నుంచి నాగచైతన్య, అఖిల్ వరకు అందరు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమదైన మార్క్ ను అందుకున్నారు. వీరంతా ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక నాగ చైతన్య ఇటీవలే రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. బాలీవుడ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ళతో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.. సడెన్ గా ఇంత షాక్ ఇచ్చారని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే శోభిత, చైతన్య మ్యారేజ్ గురించి ఇప్పటికే పలు రకాల వార్తలు వినిపించాయి. కానీ వీరి పెళ్లి అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య జరగబోతుందని సమాచారం.. ఇదిలా ఉండగా శోభిత పెళ్లికి ముందే పిల్లల గురించి ఆలోచిస్తుందని తెలుస్తుంది. తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
నాగ చైతన్య, శోబిత తో రిలేషన్ లో ఉన్న సంగతి సీక్రెట్ ఉంచారు. వీరిద్దరి పై ఎన్ని వార్తలు వచ్చినా కూడా మౌనంగానే ఉన్నారు. ఆగస్టు 8 న వీరిద్దరూ కుటుంబ సభ్యుల మధ్య ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక పెళ్లి వచ్చే ఏడాదిలో అని టాక్.. అంతవరకు ఎవరి సినిమాలు వాళ్లు చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు. బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది శోభిత దూళిపాళ్ళ. అయితే పెళ్లికి ముందే పిల్లల గురించి, వాళ్లకు ఏం చెప్పాలో శోభిత డిసైడ్ అయిపోయింది. ఇందుకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.. ఆ పోస్ట్ వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ఆమె ఉద్దేశ్యం ఏంటంటే..
ఇకపోతే తెలుగులో ‘మేజర్’, ‘గూఢచారి’ సినిమాలు చేసిన శోభిత.. ఇతర భాషల్లో మాత్రం చాలా చిత్రాల్లో నటించింది. అలా తమిళంలో చేసిన మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’. మణిరత్నం తీసిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేశారు. తాజాగా ఐఫా వేడుకలో బోలెడన్ని అవార్డులు దక్కించుకుంది. తాజాగా ఈ చిత్రం రిలీజై రెండేళ్లు పూర్తయింది. ఈ మేరకు ఆ మూవీ టీమ్ తో దిగిన ఫోటోను పాప సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దానికి వీరందరు అవేంజర్స్ అనే ట్యాగ్ ను ఇచ్చింది. వీళ్లందరూ అవెంజర్స్ అని నా పిల్లలకు చెబుతానని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లికి ముందే పిల్లల గురించి ఆలోచిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. అక్కినేని కొత్త కోడలు ప్లానింగ్ మాములుగా లేదు అంటూ లైకులు, షేర్లు చేస్తున్నారు. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక నాగ చైతన్య విషయానికొస్తే.. తండేల్ సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది..
View this post on Instagram