BigTV English

Jan Dhan Yojana: జన్‌ధన్ ఖాతాల్లో నిధుల వెల్లువ.. 10 ఏళ్లలో భారీగా పెరిగిన డిపాజిట్లు

Jan Dhan Yojana: జన్‌ధన్ ఖాతాల్లో నిధుల వెల్లువ..  10 ఏళ్లలో భారీగా పెరిగిన డిపాజిట్లు

Jan Dhan Yojana: ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక కార్యక్రమం ‘ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన’-PMJDY స్కీమ్ మొదలుపెట్టి పదకొండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ పథకం కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీని కింద డిపాజిట్లు రూ.2.68 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థికశాఖ గురువారం వెల్లడించింది. ఇంకా చాలా విషయాలు వెల్లడించింది.


కేంద్రంలోని మోదీ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన స్కీమ్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ పథకం మొదలుపెట్టి 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీనికింద దేశవ్యాప్తంగా 56 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు తెలిపింది. అందులో డిపాజిట్లు రూ.2.68 లక్షల కోట్లకు చేరినట్లు అధికారికంగా ప్రకటించింది.

దీనిపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, బ్యాంకు ఖాతాల లభ్యత పేదలు, అణగారిన వర్గాలకు ఆర్థిక వ్యవస్థలో పాల్గొనడం, ప్రయోజనం పొందడానికి వీలు కల్పిస్తుందన్నారు. గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలలో 67 శాతం ఖాతాలు ఓపెన్ అయ్యాయి. వాటిలో 56 శాతం మహిళలేనని పేర్కొన్నారు.


ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రయోజనాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. రుణ సౌకర్యాలు, సామాజిక భద్రత కల్పించడానికి ఈ ఆర్థిక కార్యక్రమం ప్రధాన మాధ్యమంగా మారిందన్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా ఖాతాదారులకు 38 కోట్లకు పైగా రూపే డెబిట్ కార్డులు జారీ చేసినట్టు తెలిపారు.

ALSO READ:  18 నుంచి 5 శాతానికి జీఎస్టీ..  నెలవారీ టీవీ బిల్లుకు ఊరట

2017-18 ఏడాదిలో పీఓఎస్, ఈ-కామర్స్ ద్వారా 67 కోట్ల రూపే కార్డు లావాదేవీలు జరిగాయి. ఆ సంఖ్య 2024 నాటికి 93.85 కోట్లకు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా, ప్రతి వయోజనుడికి బీమా, పింఛను సౌకర్యం ఉండాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన.

దశాబ్దంలో జన్ ధన్ ఖాతాలలో డిపాజిట్లు దాదాపు 12 రెట్లు పెరిగాయి. ఖాతాకు సగటు బ్యాలెన్స్ మూడు రెట్లు పెరిగి ₹4,768 కి చేరుకుంది. నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్‌గా ప్రవేశపెట్టబడిన ఈ పథకం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలను విస్తరించింది.  ఈ పథకం కింద వ్యక్తులు జీరో బ్యాలెన్స్‌తో సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయవచ్చు.

2 లక్షల వరకు ప్రమాద బీమా కవరేజ్‌తో RuPay డెబిట్ కార్డు, 10 వేల వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అందిస్తుంది. PMJDY అనేది సంక్షేమ కార్యక్రమాలకు పునాదిగా మారింది. 327 ప్రభుత్వ పథకాలకు వీటి ద్వారానే నగదు బదిలీ చేస్తోంది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి పథకాల నమోదుకు మద్దతు ఇచ్చింది.

ఆర్థికశాఖ దీనిపై మూడు నెలలు దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించింది. మొదటి నెల చివరి నాటికి అధికారులు జిల్లాల్లో 99,753 శిబిరాలను నిర్వహించింది. 6.6 లక్షల కొత్త PMJDY ఖాతాలను ప్రారంభించారు. 22.65 లక్షలకు పైగా లబ్ధిదారులను బీమా-పెన్షన్ పథకాల కింద నమోదు చేసుకున్నారు.

Related News

Jio Special Offer: జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్.. జస్ట్ రూ.91కే వాలిడిటీ అన్ని రోజులా!

GST on Cable TV: 18 నుంచి 5 శాతం జీఎస్టీ.. నెలవారీ టీవీ బిల్లులకు భారీ ఊరట!

Gold Rate Hikes: పసిడి ప్రియులకు షాక్! మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

BSNL vs JIo Airtel: BSNL నుంచి అదిరిపోయే ప్లాన్.. జస్ట్ రూ. 147కే నెల రోజుల వ్యాలిడిటీ!

Gas cylinder scams: నకిలీ సీల్, నకిలీ బిల్.. గ్యాస్ సిలిండర్ మోసాలు ఎలా గుర్తించాలి?

Big Stories

×