మిన్నియాపాలిస్ లోని అనౌన్సియేషన్ కాథలిక్ స్కూల్ లోని చర్చిపై కాల్పులు జరిపి ఇద్దరు పిల్లల మరణానికి కారణైన హంతకుడు రాబిన్ వెస్ట్ మన్ ఆయుధాలపై ఉన్న సందేశాలు సంచలనంగా మారాయి. మూడు ఆయుధాలను ఉపయోగించి అతడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. చివరకు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. అతడి ఆయుధాలపై న్యూక్ ఇండియా, కిల్ డొనాల్డ్ ట్రంప్ నౌ, ఇజ్రాయెల్ మస్ట్ ఫాల్, బర్న్ ఇజ్రాయెల్, వేర్ ఈజ్ గాడ్ అనే సందేశాలున్నాయి. విద్వేషకరమైన భావాలున్న వ్యక్తిగా రాబిన్ ని గుర్తించారు పోలీసులు.
The Minneapolis Catholic school shooter was Robin Westman.
He was a biological male who identified as a transgender "woman."
Written on his guns and magazines were things like "kill Trump now," "6 million was not enough" (referring to the Holocaust), "for the children," "I'm… pic.twitter.com/KGEauspsTQ
— Leftism (@LeftismForU) August 27, 2025
ఎవరీ రాబిన్..? ఆడా? మగా?
కాల్పులు జరిపింది రాబిన్ వెస్ట్ మన్. పుట్టుకతో మగ, పేరు రాబర్ట్. కానీ 2020లో రాబర్ట్ నుండి రాబిన్‌గా పేరు మార్చుకుని మహిళగా గుర్తింపు పొందినట్లు లీగల్ డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ మాత్రం హంతకుడు పురుషుడేనని ధృవీకరించడం విశేషం. దర్యాప్తు అధికారులు మాత్రం రాబిన్ అలియాస్ రాబర్ట్ ని ట్రాన్స్‌జెండర్ గా గుర్తించి విచారణ కొనసాగిస్తున్నారు. కాల్పులకు ముందు రాబిన్ డబ్ల్యూ అనే యూట్యూబ్ ఛానెల్‌లో రెండు వీడియోలు పోస్ట్ చేశారు. ఆ రెండు వీడియోల ద్వారా హంతకుడి ఉద్దేశాలు స్పష్టంగా తెలుస్తున్నాయని అంటున్నారు. అయితే అధికారులు వాటిని తర్వాత డిలీట్ చేయించారు. తమ విచారణకోసం మాత్రం వాటిని వాడుకుంటున్నారు. రెండో వీడియోలో సిరిలిక్ భాషలో ఉన్న రెండు జర్నల్స్ ని అప్ లోడ్ చేశారు. ఈ సిరిలిక్ లిపిని రష్యా, బల్గేరియా, సెర్బియా, ఉక్రెయిన్, కజకస్తాన్, కిర్గిజ్ వంటి దేశాల్లో వాడుతుంటారు.
We have confirmation that the shooter at Annunciation Catholic School in Minneapolis, MN was a 23 year-old man, claiming to be transgender.
This deranged monster targeted our most vulnerable: young children praying in their first morning Mass of the school year. This deeply sick…
— Secretary Kristi Noem (@Sec_Noem) August 27, 2025
దేశీయ ఉగ్రవాదం
కేథలిక్స్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడమే హంతకుడి ధ్యేయం అని దాదాపుగా నిర్థారకణకు వచ్చారు అధికారులు. దీనిని దేశీయ ఉగ్రవాదంగా పరిగణిస్తూ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. హంతకుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని, అతడు తుపాకులను కూడా అధికారికంగానే కొనుగోలు చేశాడని తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత అతడి కుటుంబం పరారీలో ఉంది. ఈ ఘటన ద్వారా అమెరికాలో స్కూళ్ల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులను అతి కిరాతకంగా కాల్చి చంపడం సంచలనంగా మారింది. దుండగుడి మానసిక స్థితిని, ఆన్ లైన్ ద్వారా అతడిని ఇన్ ఫ్లూయెన్స్ చేసిన వారి గురించి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆయుధాల సేకరణపై కూడా మరింత లోతుగా విచారణ జరుగుతోంది. ఇది అమాయక పిల్లలపై ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడి అని పేర్కొన్నారు మిన్నియాపాలిస్ పోలీస్ చీఫ్ బ్రియాన్ ఒహరా. ఈ దాడి అమానుషం అని ఆయన అన్నారు.
146 దాడులు
ఈ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు, బాధితుల కుటుంబాల పట్ల గౌరవ సూచికంగా జాతీయ జెండాను సగం ఎత్తులో ఎగరేసి ఉంచాలని ఆదేశించారు. ఈ కాల్పుల ఘటనతో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకు 146 స్కూల్స్ లో దాడులు జరగడం గమనార్హం. దాడికి ఉపయోగించిన ఆయుధాలపై ఇండియా పేరు ఉండటం మరింత సంచలనంగా మారింది.