BigTV English

Vanitha Vijayakumar : వివాదాస్పద నటి నాలుగో పెళ్లి.. వరుడు ఎవరో తెలిస్తే షేక్ అవ్వాల్సిందే

Vanitha Vijayakumar : వివాదాస్పద నటి నాలుగో పెళ్లి.. వరుడు ఎవరో తెలిస్తే షేక్ అవ్వాల్సిందే

Vanitha Vijayakumar : వివాదాస్పద నటి వనితా విజయ్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ నటుడే అయినా తెలుగువారికి సుపరిచితుడు విజయ్ కుమార్. స్నేహం కోసం సినిమాలో చిరంజీవి ఫ్రెండ్  గా కనిపించి మెప్పించిన ఆయన ఇప్పటికీ ఎన్నో మంచి పాత్రల్లో నటిస్తున్నాడు. ఇక విజయ్ కుమార్ ను తెలుగు నటి మంజుల వివాహం చేసుకున్న విషయం కూడా విదితమే. ఈ జంటకు ముగ్గురు కుమార్తెలు.


ప్రభాస్ మొదటి సినిమా హీరోయిన్ శ్రీదేవి కూడా విజయ్ కుమార్ చిన్న కుమార్తెనే. ఇక వారి పెద్ద కుమార్తెనే వనితా  విజయ్ కుమార్. కూతుళ్ళందరిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు విజయ్ కుమార్. అయితే సినిమాలకన్నా  ఎక్కువ వివాదాలతోనే ఫేమస్ అయ్యింది వనితా. ఇప్పటి వరకు ఆమె మూడు పెళ్లిళ్లు చేసుకుంది.  2000 సంవత్సరంలో నటుడు ఆకాష్ ను వివాహం చేసుకుంది. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. విభేదాల వలన భర్తకు విడాకులు ఇచ్చిన వనితా.. 2007 లో ఆనంద్ జయదర్శన్ ను వివాహమాడింది. వీరికి ఒక కూతురు.

ఇకవీరి కాపురం కూడా సజావుగా సాగలేదు. ఐదేళ్ల తరువాత వీరు కూడా విడిపోయారు. మధ్యలో ఆస్తి తగాదాల వలన విజయ్ కుమార్ కూతురును బయటకు గెంటేశాడు. అప్పుడు కూడా వనితా మీడియాకు ఎక్కి తన తల్లి మంజుల బతికి ఉన్నంతకాలం తనను బాగా చూసుకున్నారని, ఇప్పుడు అందరూ తనను బయటకు గెంటేసి ఆస్తి దక్కకుండా చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. నిజం చెప్పాలంటే.. విజయ్ కుమార్ కుటుంబం .. వనితాను ఒక ఫ్యామిలీ మెంబెర్ గా  కూడా చూడడం లేదు. ఏ ఫ్యామిలీ ఫంక్షన్ లో కూడా ఆమె కనిపించదు.


ఇక పిల్లలతో ఒంటరిగా జీవనం సాగిస్తున్న సమయంలో వనితా  జీవితంలోకి పీటర్  పాల్ వచ్చాడు. 2020 లో  పీటర్ తో వనితా మూడో వివాహము జరిగింది. అయితే అది మరీ దారుణం.. ముచ్చటగా మూడు నెలలు కూడా నిండకుండానే వీరు విడిపోయారు.  ఇలా పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటూ వస్తున్నా వనితా.. ఇప్పుడు నాలుగో పెళ్ళికి రెడీ అయ్యింది. అది తన చిరకాల బాయ్ ఫ్రెండ్ రాబర్డ్ తో పెళ్ళికి సిద్దమయ్యింది. కొరియోగ్రాఫర్ రాబర్ట్ తెలుగువారికి కూడా సుపరిచితమే.

కొరియోగ్రాఫర్ గానే కాకుండా నటుడిగా  కూడా రాబర్ట్ కు మంచి పేరు ఉంది. అప్పట్లో అతను తెలుగు హీరోల సినిమాల్లో విలన్ గా కనిపించేవాడు. ఇక ఢీ షోలో కూడా  రాబర్ట్ మాస్టర్ సందడి చేశాడు. వీరిద్దరి మధ్య పరిచయం ఇప్పటిది కాదని తెలుస్తోంది.  43 ఏళ్ళ రాబర్ట్ తో వనితా నాలుగో పెళ్ళికి సిద్దమయ్యింది. అక్టోబర్ 5 న వీరి పెళ్లి ఘనంగా జరగనుంది. ఇందుకు సంబంధించిన ఫోటోను వనితా అభిమానులతో పంచుకుంటూ.. పెళ్ళికి రమ్మని ఆహ్వానించింది. సముద్రపు ఒడ్డున రాబర్ట్ నిలబడి ఉండగా.. వనితా మోకాళ్ళు వంచి అతడికి ప్రపోజ్ చేస్తున్న ఫోటో ఆకట్టుకుంటుంది. ఇక ఈసారైనా రాబర్ట్ తో కలిసి ఉండాలని అభిమానులు కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related News

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Big Stories

×