E-Paper
Advertisement

Siddu Jonnalagadda: టిల్లుకు, నాకు మధ్య ఉన్న తేడా అదే.. ?

Siddu Jonnalagadda: టిల్లుకు, నాకు మధ్య ఉన్న తేడా అదే.. ?
Advertisement

Siddu Jonnalagadda: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డీజే టిల్లు సినిమాతో సిద్దు బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని స్టార్ బాయ్ గా మారాడు. ఇక దీనికి సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం టిల్లు స్క్వేర్. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్నో అంచనాల నడుమ టిల్లు స్క్వేర్ రేపు అనగా మార్చి 29 న  థియేటర్ లో రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన సిద్దు తాజాగా సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Advertisement

డీజే టిల్లు లాంటి భారీ విజయానికి సీక్వెల్ గా వస్తున్న సినిమా కదా.. ఏమైనా ఒత్తిడి ఉందా? అన్న ప్రశ్నకు సిద్దు మాట్లాడుతూ.. ” డీజే టిల్లు సమయంలో ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాల్లేవు. హీరో పాత్ర ఎలా ఉంటుంది అనేది ముందు ఎవరికి తెలీదు. అందుకే ఆ పాత్రను చూసి ప్రేక్షకులు సర్ ప్రైజ్ అయ్యారు. ఇప్పుడు అదే పాత్రతో మరోసారి మ్యాజిక్ చేయాల్సి రావడంతో కాస్త ఒత్తిడి ఉండటం సహజం. అయితే ఒత్తిడిని జయించి మెరుగైన అవుట్ పుట్ ని అందించడానికి కృషి చేశాం” అని చెప్పుకొచ్చాడు. ఇక సీక్వెల్ కి దర్శకుడు మారడంపై సిద్దు మాట్లాడుతూ.. ” సీక్వెల్ చేద్దాం అనుకున్న సమయంలో విమల్ వేరే ప్రాజెక్ట్ కమిట్ అయ్యి ఉండటంతో అందుబాటులో లేరు. మరోవైపు నేను, మల్లిక్ ఒక సినిమా చేద్దామని అప్పటికే అనుకుంటున్నాము. మా కలయికలో డీజే టిల్లు సీక్వెల్ చేస్తే బాగుంటుంది అనిపించి.. అలా మల్లిక్ న దర్శకుడిగా తీసుకోవడం జరిగిందని” చెప్పుకొచ్చాడు.

ఇక డీజే టిల్లు పాత్ర ఎలా పుట్టింది.. టిల్లుకు, మీకు దగ్గర పోలికలు ఉన్నాయా..? అన్న ప్రశ్నకు సిద్దు మాట్లాడుతూ.. ” టిల్లు పాత్ర నా ఆలోచనలు, నేను చూసిన అనుభవాల నుంచి పుట్టింది. టిల్లుకి, నాకు ఒక్కటే తేడా. టిల్లు తన మనసులో ఉన్నవన్నీ బయటకు అంటాడు. నేను మనసులో అనుకుంటాను అంతే తేడా” అని తెలిపాడు. మరి ఈ సినిమా సిద్ధుకు ఎలాంటి విజయాన్ని తీసుకొస్తుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×