E-Paper
Advertisement

Sitara Ghattamaneni: సూపర్ స్టార్ గుండెల మీద యువరాణి సేద తీరిన వేళ..

Sitara Ghattamaneni: సూపర్ స్టార్ గుండెల మీద యువరాణి సేద తీరిన వేళ..
Advertisement

Sitara Ghattamaneni: సాధారణంగా సెలబ్రిటీల పిల్లలు ఎవరైనా పెద్దయ్యాకా ఫ్యాన్స్ యూ సంపాదించుకుంటారు. కానీ, ఘట్టమనేని వారసురాలు పుట్టడమే ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. మహేష్ బాబు – నమ్రతల ముద్దుల తనయగా సితార పుట్టిన వెంటనే ఫ్యాన్స్ అందరూ యువరాణి పుట్టిందని సంబురాలు జరుపుకున్నారు. ఇక ఈ చిన్నది పెరిగేకొద్దీ నమ్రత.. సోషల్ మీడియాకు క్వీన్ గా మార్చేసింది.

నిత్యం సితార ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఆమెను చిన్నపాటి సెలబ్రిటీని చేసేసింది. ఇక ఊహ వచ్చాక సీతూ పాప కూడా అభిమానులకు దగ్గరయింది. అతి చిన్న వయస్సులోనే యూట్యూబ్ లో వీడియోలు చేయడం, డ్యాన్స్ వీడియోలు చేయడం చేసి షాక్ ఇచ్చింది. తండ్రి నటనను, తల్లి అందాన్ని పుణికిపుచ్చుకున్న సీతూ పాప.. పదేళ్ల వయస్సులోనే జ్యూవెలరీ యాడ్ లో కనిపించి షాక్ ఇచ్చింది. అందమే అసూయ పడే అందంతో సితార మెప్పించింది.

Advertisement

ఇక ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఆడపిల్ల ఎప్పుడు నాన్నకూచినే. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు సితార కూడా అతీతం కాదు. తండ్రి మహేష్ పక్కన చేరింది అంటే సితారకు ప్రపంచమే గుర్తు ఉండదు. మహెహ్స్ కూడా అంతే. ఎంత అలిసిపోయి వచ్చినా సితారతో ఆడకుండా మహేష్ నిద్రపోడు అంట. తండ్రి కూతుళ్ళ బాండింగ్ అలా ఉంటుంది. మహేష్ అందరి ముందు ఎంత రిజర్వ్డ్ గా ఉన్నా కూడా కూతురుతో కలిస్తే చిన్నపిల్లాడిలా మారిపోతాడు.

ఇక తండ్రితో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకోవడానికి సీతూ పాప ఎప్పుడు ముందు ఉంటుంది. నేడు ఫాదర్స్ డే కావడంతో.. తండ్రికి విషెస్ చెప్తూ ఇదుగో ఈ అద్భుతమైన ఫోటోలను షేర్ చేసింది. మహేష్ అలా కుర్చీలో వాలి ఉండగా.. ఆయన గుండెల మీద కూర్చొని నవ్వుతూ ఫోటోలకు పోజ్ ఇచ్చింది. ఇక ఈ ఫొటోస్ లో మహేష్ లుక్ ఎంతో బావుంది. సూపర్ స్టార్ గుండెల మీద యువరాణి సేద తీరిన వేళ.. ఎంత బావున్నారా ఈ తండ్రీకూతుళ్లు అని, ఎంత సూపర్ స్టార్ అయినా.. కూతురుకు బొమ్మనే అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×