EPAPER

Sobhita Dhulipala: ఎంగేజ్ మెంట్ తరువాత మొదటి పోస్ట్ పెట్టిన శోభితా.. చై గురించి ఏం చెప్పిందంటే..?

Sobhita Dhulipala: ఎంగేజ్ మెంట్ తరువాత మొదటి పోస్ట్ పెట్టిన శోభితా.. చై గురించి ఏం చెప్పిందంటే..?

Sobhita Dhulipala: తెనాలి అమ్మాయి శోభితా ధూళిపాళ్ల ఎట్టకేలకు అక్కినేని పెద్ద కోడలిగా మారబోతుంది. గురువారం ఉదయం అక్కినేని నాగ చైతన్య- శోభితాల నిశ్చితార్థం అత్యంత సన్నిహితుల మధ్య అక్కినేని ఇంట గ్రాండ్ గా జరిగింది. వీరి నిశ్చితార్థం విషయాన్ని అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.


శోభితాను అక్కినేని ఇంటి కోడలిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపాడు. నిన్నటి నుంచి శోభితా.. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక ఇప్పటికే చై కు సమంత పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరూ విడిపోయాక శోభితాతో చై డేటింగ్ చేసినట్లు సమాచారం.

రెండేళ్ల తరువాత ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి ఈ జంట నిశ్చితార్థం చేసుకుంది. ఈ వేడుక తరువాత అటు చై కానీ, ఇటు శోభితా కానీ, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. ఇక తాజాగా శోభితా.. తన ఎంగేజ్ మెంట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ.. చై గురించి కవిత్వం రాసుకొచ్చింది. కురుంతోగై అనే తమిళ్ కవిత్వం నుంచి కొన్ని లైన్స్ రాసుకొచ్చింది.


” నా తల్లి మీకేమి కాదు.. నా తండ్రి మీకు ఏ బంధువు కాదు. నేను, నువ్వు ఎలా కలిసినా కానీ.. ప్రేమలో మన హృదయాలు ఎర్రటి భూమిపై వర్షం కురుస్తున్నట్లుగా ఉన్నాయి. విడిపోవడానికి మించి కలిసిపోయాయి” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×