E-Paper
Advertisement

Sobhita Dhulipala: కల్కిలో నాగ చైతన్య రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్.. గుర్తుపట్టారా.. ?

Sobhita Dhulipala: కల్కిలో నాగ చైతన్య రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్.. గుర్తుపట్టారా.. ?
Advertisement

Sobhita Dhulipala: ఏంటి.. టైటిల్ చూడగానే షాక్ అయ్యారా.. ? కల్కిని నాలుగు సార్లు చూసాం.. ఎక్కడా మాకు నాగ చైతన్య రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ కనిపించలేదు ఏంటి చెప్మా అని ఎక్కువ ఆలోచించకండి. కల్కిలో అందాల ముద్దుగుమ్మ శోభితా ధూళిపాళ్ల ప్రత్యేక్షంగా లేకపోయినా.. పరోక్షంగా ఉంది. అంటే ఆమె కనిపించకపోయినా.. ఆమె గాత్రం వినిపించింది అని అర్ధం. అంటే.. ఇంకా అర్ధం కాలేదా.. ? దీపికా పదుకొనేకు తెలుగు డబ్బింగ్ చెప్పింది శోభితానే.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ భైరవగా నటించగా.. దీపికా సుమతిగా కనిపించింది. ఇక బాలీవుడ్ బ్యూటీ దీపికా మొదటి తెలుగు సినిమా కావడంతో.. ఆమె డబ్బింగ్ చెప్పుకోలేకపోయింది. మొదట ట్రైలర్ లో దీపికా డబ్బింగ్ చెప్పడానికి ట్రై చేసింది కానీ, అది వర్క్ అవుట్ అవ్వలేదట. అందుకే దీపికాకు ఒక హీరోయిన్ తో డబ్బింగ్ చెప్పించాలని అనుకున్నారట మేకర్స్.

Advertisement

ఆ సమయంలోనే శోభితా పేరు పలువురు సజిస్ట్ చేయడంతో నాగీ.. శోభితతో డబ్బింగ్ చెప్పించాడట. శోభిత తెనాలి అమ్మాయి కావడంతో.. ఆమెకు తెలుగు స్పష్టంగా వచ్చు. ఇక దీపికాకు శోభిత వాయిస్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యిందనే చెప్పాలి. అస్లు ఇప్పటివరకు ఆమెకు శోభిత డబ్బింగ్ చెప్పిందన్న విషయం ఎవరు కనిపెట్టలేకపోయారు. టైటిల్ క్రెడిట్స్ లో శోభిత పేరు చూడడంతో ఈ విషయం బయటపడింది. దీంతో శోభిత పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది.

తెనాలి అమ్మాయి అయినా.. మొదట బాలీవుడ్ లో పాగా వేసాకా.. గూఢచారి సినిమాతో తెలుగుకు పరిచయమైంది. ఇక్కడ స్టార్ హీరోయిన్ గా కొనసాగలేకపోయినా.. పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది. ఇరాక్ అమ్మడు సినిమాలతో తెచ్చుకున్న పేరు కన్నా.. నాగ చైతన్య రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ గా బాగా ఫేమస్ అయ్యింది. సమంతకు విడాకులు ఇచ్చాక చై.. శోభితతో రిలేషన్ లో ఉన్నాడని వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే వీరు జంటగా కనిపించి షాక్ ఇచ్చారు. మరి ముందు ముందు.. ఈ జంట పెళ్లి చేసుకొనే అవకాశాలు ఉన్నాయో లేదో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×