BigTV English
Advertisement

Sonali Bendre: మహేష్ ను అవమానించిన సోనాలి బింద్రే.. ఈమె ఒక హీరోయినా.. ?

Sonali Bendre: మహేష్ ను అవమానించిన సోనాలి బింద్రే.. ఈమె ఒక హీరోయినా.. ?

Sonali Bendre:ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా గత రెండు నెలలుగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరూ మురారి రీరిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకొని ఆగస్టు 9 న మురారి రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దీంతో గత నెల నుంచి ఫ్యాన్స్ హంగామా మొదలుపెట్టేశారు. అది కూడా ఏ రేంజ్ లో అంటే.. మురారి, వసుంధర ల పెళ్లి పత్రిక అంటూ నిజంగానే పెళ్లి పత్రికలను అచ్చు వేయించి పంచేస్తున్నారు.


ఇంకోపక్క థియేటర్ లోనే అమ్మాయి ఒప్పుకుంటే తాళి కట్టేద్దామని సింగిల్ కుర్రాళ్ళు ఏకంగా తాళి, తలంబ్రాలు పట్టుకొని వెళ్తున్నామని సోషల్ మీడియాలో కామెంట్స్ చేసి హల్చల్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఆగస్టు వచ్చేసింది. ఇంకో 8 రోజుల్లో మురారి మరోసారి థియేటర్ లో రిలీజ్ కానుంది. మహేష్ బాబు, సోనాలి బింద్రే జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2001 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.

సోనాలి బింద్రే మొదటి సినిమా ఇదే కావడం, ఇక మొదటి సినిమాతోనే ఆమె స్టార్ హీరోయిన్ గా మారడం విశేషం. ఇక దీంతో మురారి రీరిలీజ్ గురించి ఆమె తాజాగా ఒక చిన్న బైట్ ఇచ్చింది. యాంకర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. మురారి తన కెరీర్ లో స్పెషల్ ఫిల్మ్ అని, కృష్ణవంశీ ఎంతో అందంగా, అద్భుతంగా తెరకెక్కించాడని చెప్పుకొచ్చింది.


మురారి వలన నందిని రెడ్డి లాంటి మంచి ఫ్రెండ్ దొరికిందని, ఇప్పుడు డైరెక్టర్ అయిన నందిని రెడ్డి.. అప్పుడు మురారికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది. ఆమెనే తనకు తెలుగు డైలాగ్స్ నేర్పించిందని, ఎంతో ఓపిగ్గా అవన్నీ నేర్చుకొనేలా చేసిందని తెలిపింది. కాస్ట్యూమ్స్, సాంగ్స్, సెట్స్ అన్నింటి గురించి మాట్లాడింది కానీ, వీడియో మొత్తం ఒక్కసారైనా మహేష్ బాబు పేరు తీసుకురాలేదు.

సాధారణంగా మొదటి సినిమా హీరోను ఏ హీరోయిన్ మర్చిపోదు. అది కూడా హిట్ సినిమా హీరోను మర్చిపోరు. సోనాలి.. అన్నింటి గురించి మాట్లాడి ఒక్క మాట కూడా మహేష్ గురించి మాట్లాడకపోవడం ఆయనను అవమానించినట్లే అని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈమె ఒక హీరోయినా అని ప్రశ్నిస్తున్నారు. మరి సోనాలి  కావాలనే మహేష్ పేరు చెప్పడం మరిచిందా.. ? లేక మహేష్ కు సంబంధించిన ప్రశ్న రాలేదు కాబట్టి చెప్పలేదా అనేది తెలియాలి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Big Stories

×