E-Paper
Advertisement

Spirit: ప్రభాస్‌ను ఇంతవరకు అలా చూసుండరు.. గ్యారెంటీ ఇస్తున్నా: సందీప్ రెడ్డి వంగా

Spirit: ప్రభాస్‌ను ఇంతవరకు అలా చూసుండరు.. గ్యారెంటీ ఇస్తున్నా: సందీప్ రెడ్డి వంగా
Advertisement
Today tollywood news

Prabhas spirit movie update(Today tollywood news):

సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరు వినగానే అందరికీ రెండు సినిమాలు గుర్తొస్తాయి. ఒకటి ‘అర్జున్ రెడ్డి’, మరొకటి ‘యానిమల్’. ఈ రెండు చిత్రాలతో సందీప్ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల రిలీజైన ‘యానిమల్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని.. కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీంతో తన తదుపరి చిత్రంపై అందరిలోనూ ఆసక్తి మొదలైంది.

అయితే ఆయన నెక్స్ట్ మూవీని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో తెరకెక్కించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా సందీప్ వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ రూపొందడానికి సిద్ధమైంది. ఇదే విషయాన్ని దర్శకుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు.. ఈ చిత్రంలో తన మార్క్‌ను ప్రభాస్‌పై ఏ రేంజ్‌లో చూపించబోతున్నాడో తెలియజేశాడు. ఆయన మాటలతో ప్రభాస్ అభిమానుల్లో ఫుల్ జోష్ మొదలైంది. హమ్మయ్య.. ప్రభాస్ నెక్స్ట్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో సందీప్ ఏమని మాట్లాడరంటే..

Advertisement

ప్రభాస్‌ని ఇంతవరకు ఫ్యాన్స్ ఎప్పుడూ చూడలేని విధంగా, చాలా కొత్తగా చూపిస్తాను. ఇంత వరకూ ప్రభాస్ అలాంటి పాత్ర చేయలేదు. ఫ్యాన్స్‌కి మాత్రం ఓ ‘ఐ ఫీస్ట్’ ట్రీట్ ఇస్తా అని సందీప్ అన్నాడు. అందరూ అనుకుంటున్నట్టే ఈ సినిమా ఫిబ్రవరిలో మొదలయ్యే ఛాన్స్ ఉందని సందీప్ రెడ్డి వంగ చెప్పారు. ఇక ఈ వార్తను ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×