BigTV English

Sreeleela: దొంగగారి గర్ల్ ఫ్రెండ్ కు తల పొగరు ఎక్కువట.. ?

Sreeleela: దొంగగారి గర్ల్ ఫ్రెండ్ కు  తల పొగరు ఎక్కువట.. ?
Advertisement

Sreeleela:శ్రీలీల.. తెలుగు కుర్రాళ్ళు గత కొన్నేళ్లుగా ఈ పేరును మంత్రంలా జపిస్తున్నారు. పెళ్లి సందD చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది శ్రీలీల. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణ అనగానే సినిమా ఏమో కానీ, అందరి చూపు అమ్మడిమీదనే పడింది. దొరక్క దొరక్క దొరికింది.. తళుక్కు చిలక ఇది అనగానే.. ఇక అభిమానులు కూడా అదే కన్ఫర్మ్ చేసుకున్నారు. దొరక్క దొరక్క దొరికింది అని శ్రీలీలకు గుండెల్లో గుడికట్టి మరీ పూజలు చేస్తున్నారు.


మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాకముందే డజన్ల సినిమాలకు సైన్ చేసి ఇండస్ట్రీని షేక్ చేసింది ఈ చిన్నది. ఓడియమ్మ.. ఇదెక్కడ ట్విస్ట్.. సీనియర్, జూనియర్ హీరోలు అని తేడా లేకుండా ఇన్ని సినిమాలు లైన్లో పెట్టింది అనుకున్నారు. కానీ, అప్పుడే అమ్మడితో విధి ఆడింది వింత నాటకం. ఎంత స్టార్ హీరోలు అయినా.. కథ లేకపోతే సినిమాలను ప్రేక్షకులు షెడ్డుకే పంపిస్తారు అన్న విషయాన్నీ మరిచింది. ఒకటి రెండు సినిమాలు తప్ప శ్రీలీల నటించిన ఏ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. అయినా ఈ చిన్నది దైర్యం వదలకుండా నిలబడింది. కాకపోతే కొంచెం అలోచించి కథలను ఎంచుకోవడం మొదలుపెట్టింది.

ఇక ఈ మధ్యనే ఒక రెండు సినిమాలకు సైన్ చేసిన శ్రీలీల.. నేడు తన 23 వ పుట్టినరోజును జరుపుకుంటుంది. దీంతో అమ్మడు నటిస్తున్న సినిమాల నుంచి కొత్త పోస్టర్స్, గ్లింప్స్ ను రిలీజ్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.తాజాగా ఈ బ్యూటీ నితిన్ సరసన రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యింది. భీష్మ కాంబోను రిపీట్ చేస్తూ నితిన్, రష్మిక మందన్న, వెంకీ కుడుముల.. రాబిన్ హుడ్ సినిమాను మొదలుపెట్టిన విషయం తెల్సిందే. ఈ సినిమా అనౌన్స్ మెంట్ వీడియోలో వారికి వారే రోస్ట్ చేసుకొని గట్టి హైప్ ఇచ్చారు నితిన్, రష్మిక.


ఈ కాంబో రిపీట్ అంటే సూపర్ అనుకున్న ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్ గా రష్మిక ఇందులో నుంచి అవుట్ అయ్యిందని, శ్రీలీల ఆ ప్లేస్ ను రీప్లేస్ చేసింది అని రూమర్స్ వచ్చాయి కానీ.. మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఈరోజతో ఆ బాధ కూడా పోయింది. రాబిన్ హుడ్ లో శ్రీలీల నీరా వాసుదేవ్ అనే పాత్రలో కనిపిస్తుందని మేకర్స్ తెలిపారు. అంతేకాకుండా ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుందో శాంపిల్ గా చూపించారు.

బరువు తెలియదు కానీ, తల పొగరు మాత్రం కొలవలేనంత.. లేడీ బాస్ నీరా వాసుదేవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి.. దొంగగారి గర్ల్ ఫ్రెండ్ కు తల పొగరు ఎక్కువే అన్నట్లు తెలుస్తోంద. మరి ఆ తలపొగరును రాబిన్ హుడ్ ఎలా దించుతాడో తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే. ఇక లేడీ బాస్ గా ముద్దుగుమ్మ బాగానే కనిపించింది. మరి ఈ సినిమాతో ఈ చిన్నది ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

Big Stories

×