BigTV English

SriReddy: పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు.. షాక్ లో ఫ్యాన్స్..?

SriReddy: పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు.. షాక్ లో ఫ్యాన్స్..?

SriReddy.. తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీరెడ్డి (Srireddy ) పేరు ప్రథమంగా వినిపిస్తుంది. ఈమె హీరోయిన్ కాకపోయినా అడపాదడపా చిన్న చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించి , హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుంది. హాట్ అందాలతో యువతకు పిచ్చెక్కించే ఈమె తన మాటలతో అందరికీ చిరాకు తెప్పిస్తుంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఈమె చేసే కామెంట్లకు వారి పరువు మర్యాదలు కూడా పోతున్నాయని చెప్పవచ్చు. ఇకపోతే శ్రీ రెడ్డి గతంలో నాచురల్ స్టార్ నాని పై అనుచిత వ్యాఖ్యలు చేసి.. ఈమె ఆ తర్వాత ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్.. తనతో ఏకాంతంగా గడిపాడని , అందుకు సంబంధించిన ఫోటోలు, వాట్సప్ స్క్రీన్ షాట్ లో కూడా షేర్ చేసి సంచలనం సృష్టించింది.


పశ్చాతాపదీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్..

ఇక మెగా ఫ్యామిలీ పై ఈమె ఏ రేంజ్ లో విరుచుకు పడుతుందో అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్ చేస్తుందో తెలియదు కానీ అందులో ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై ఈమె చేసే కామెంట్లు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే తిరుపతిలో స్వామివారి ప్రసాదమైన లడ్డూ లో కల్తీ ఉందని తేలడంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పశ్చాత్తాప దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. 11 రోజుల పాటు సాగే ఈ దీక్షను పవన్ కళ్యాణ్ చేపట్టారు. హిందూ ధర్మాన్ని కాపాడడమే ధ్యేయమని, సనాతన ధర్మం పాటించడం మనందరి బాధ్యత అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు.


ముసలి నక్క అంటూ పవన్ పై విలుచుకుపడిన శ్రీ రెడ్డి..

SriReddy: Inappropriate comments on Pawan Kalyan.. Fans in shock..?
SriReddy: Inappropriate comments on Pawan Kalyan.. Fans in shock..?

ఇకపోతే పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ దీక్ష గురించి ఆయన మాట్లాడే మాటల గురించి శ్రీరెడ్డి షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఆ పోస్టులో ఏముందనే విషయాన్ని కొస్తే.. “హిందుత్వం పేరు అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే యెదవ, క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఈ సనాతన ధర్మం ఏ సంతలో అమ్మేశావురా సన్యాసి.. కమ్యూనిస్టు భావాలు అంటావు.. దొంగదీక్షలు అంటావ్.. ఏమన్నా మ్యాచింగ్ ఉందా.. అసలు దీపంతో సిగరెట్టు వెలిగించుకున్న వాడికి పుట్టినోడు, సనాతన ధర్మం అని పెద్దపెద్ద మాటలు ఒకటి..జోకు అవండ్రా.. నువ్వేనా చెప్పులు వేసుకుని దీక్ష చేసింది ముసలి నక్క.. హిందుత్వం పేరు తీసావ్ అనుకో గరుడ పురాణం బుక్కు పంపిస్తా” అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడింది శ్రీరెడ్డి. ప్రస్తుతం శ్రీరెడ్డి ఇలాంటి కామెంట్లు చేయడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

రాజకీయాల్లోకి వచ్చాకే ఇదంతా..

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బిజీగా ఉన్నారు. ఇక్కడ రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత ఈ మధ్య ఎక్కువగా ఆయన దీక్షలు చేపడుతూ హిందూత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నానంటూ చెబుతున్నారు. అందుకే ఈ రేంజ్ లో పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి విరుచుకుపడిందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×