E-Paper
Advertisement

Sudigali Sudheer: నువ్వు అడుగు పెడితే అరచేతుల్లో మోస్తారు జనాలు.. గోట్ సెకండ్ సింగిల్ ప్రోమో చూశారా..?

Sudigali Sudheer: నువ్వు అడుగు పెడితే అరచేతుల్లో మోస్తారు జనాలు.. గోట్ సెకండ్ సింగిల్ ప్రోమో చూశారా..?
Advertisement

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ తో గుర్తింపు తెచ్చుకొని మంచి కమెడియన్ గా మారి , ఇప్పుడు హీరోగా కొనసాగుతున్నాడు సుధీర్. గాలోడు సినిమాతో హిట్ అందుకున్న సుధీర్ ప్రస్తుతం గోట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న గోట్ చిత్రం కన్నా ముందే సుధీర్ ఈ సినిమాను ప్రకటించాడు.

ఇక ఈ సినిమాకు నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తుండగా మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో సుధీర్ సరసన హాట్ బ్యూటీ దివ్య భారతి నటిస్తోంది. ఇప్పటికే గోట్ నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక అయ్యో పాపం సారూ అంటూ రిలీజ్ అయిన సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇక మధ్యలో ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు.

Advertisement

అంతేకాకుండా సడెన్ గా సుధీర్.. మళ్లీ యాంకరింగ్ మొదలుపెట్టాడు. దీంతో సినిమా మధ్యలో ఆగిపోయిందని వార్తలు వినిపించాయి. కానీ, అందులో నిజం లేదని తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ కు ముహూర్తం ఖరారు చేస్తూ.. సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.

బాసే.. ఇలా పుట్టే లక్ మాకే లేదురా.. సెలబ్రిటీ నీకన్నా ఎవడురా.. డప్పే కొట్టి చెప్పులే ఇరగదీయరా.. నువ్వు అడుగే పెడితే అరచేతుల్లో మోస్తారే జనాలు అంటూ సాగే లిరిక్స్ తో ప్రోమో అదిరిపోయింది. ఇక మాస్ స్టెప్స్ తో సుధీర్ అదరగొట్టాడు. ఆగస్టు 17 న ఫుల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమా సుధీర్ కు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Advertisement

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×