E-Paper
Advertisement

Mahesh Babu: ఆ పని చేయను అని మహేష్ స్టూడియో మొత్తం పరిగెత్తించాడు.. కృష్ణ ఓల్డ్ వీడియో వైరల్

Mahesh Babu: ఆ పని చేయను అని మహేష్ స్టూడియో మొత్తం పరిగెత్తించాడు.. కృష్ణ ఓల్డ్ వీడియో  వైరల్
Advertisement

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇండస్ట్రీని ఏలుతున్న రోజుల్లో ఓ బుర్రిపాలెం బుల్లోడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. వారితో సమానమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. కృష్ణ అంటే ప్రయోగం. ఎలాంటి ప్రయోగాత్మకమైన సినిమాలు అన్నా ముందు కృష్ణ దగ్గరకు రావాల్సిందే. కృష్ణ ఒక్కసారి మాట ఇచ్చినా.. పట్టు పట్టినా అది అయ్యేవరకు వెనుకాడడు.

సూపర్ స్టార్ గా వెలుగొందిన ఆయన.. వయో వుద్ధాప్య సమస్యలతో రెండేళ్ల క్రితం మృతి చెందారు. ఇక కృష్ణ లెగసీని ఆయన చిన్న కొడుకు మహేష్ బాబు కొనసాగిస్తున్నాడు. మహేష్ ను కృష్ణ చిన్నప్పుడే సూపర్ స్టార్ ను చేశాడు. బాలనటుడిగా మహేష్ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక నేడు కృష్ణ జయంతి కావడంతో.. ఈ తండ్రీకొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని అభిమానులు నెమరువేసుకుంటున్నారు.

Advertisement

చిన్నతనంలో మహేష్.. మొదటిసారి నటించమని అడిగినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడో కృష్ణ తన మాటల్లో చెప్పిన ఓల్డ్ వీడియోను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. కృష్ణ కూతురు మంజుల తన యూట్యూబ్ లో తండ్రితో కలిసి ఇంటర్వ్యూ చేసింది. ఇందులో మంజుల.. మహేష్ ను మీరు చిన్నప్పుడే సూపర్ స్టార్ ను చేశారు.. అది మీరు ప్లాన్ చేశారా.. ? అలా జరిగిందా.. ? అన్న ప్రశ్నకు.. కృష్ణ మాట్లాడుతూ.. “అలా జరిగిపోయింది. షూటింగ్ చూడడానికి వచ్చాడు స్టూడియోకి. అక్కడెక్కడో షూటింగ్ జరుగుతుంటే.. దూరంగా మెట్ల మీద గెడ్డం కింద చెయ్యి పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఆ సినిమాకు కోడి రామకృష్ణ డైరెక్టర్.

మహేష్ ను చూసి ఆ అబ్బాయి ఎవరు అని అడిగారు. ఎవరో కృష్ణగారి అబ్బాయి అని చెప్పారట. ఆయన మహేష్ దగ్గరకు వెళ్లి.. బాబు.. నువ్వు యాక్ట్ చేస్తావా .. చేయవా.. ? అని అడిగారట. నేను చేయను.. నేను చేయను అని స్టూడియో అంతా పరిగెత్తించాడు. ఆఖరికి అందరూ పట్టుకొని.. మహేష్ ను ఒప్పించారు. అదే సినిమా పోరాటం. ఆ సినిమా ప్రివ్యూ చూడడానికి వచ్చిన నిర్మాత.. ఆ చిన్న కుర్రాడిగా యాక్ట్ చేసింది ఎవరు అని అడగ్గా.. నేను మా అబ్బాయి అని చెప్పాను. పెద్దయ్యాక చాలా గొప్ప స్టార్ అవుతాడు. మొదటి సినిమాలోనే మంచి ఈజ్ గా నటించాడు అని చెప్పాడు” ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఆ నిర్మాత చెప్పినట్టుగానే మహేష్.. సూపర్  స్టార్ గా మారాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×