BigTV English

Suriya: హీరోయిన్ జ్యోతిక ఎన్ని రూ.వందల కోట్లకు అధిపతో తెలుసా..?

Suriya: హీరోయిన్ జ్యోతిక ఎన్ని రూ.వందల కోట్లకు అధిపతో తెలుసా..?

Suriya..కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ జోడీ గా గుర్తింపు తెచ్చుకున్న జ్యోతిక (jyothika), సూర్యా(Suriya)గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఈ జంటపై ఎన్నో రకాల రూమర్స్ వచ్చినా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకవైపు సినిమాలు, మరొకవైపు వెబ్ సీరీస్ లు చేస్తూ నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టిన ఈ జంట ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్నారనటంలో సందేహం లేదు. ఒకవైపు భర్తకు సంబంధించి అన్ని పనులు చూసుకుంటూనే.. మరొకవైపు భార్యగా, తల్లిగా బాధ్యతలు చేపట్టిన జ్యోతిక, ఇప్పుడు నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆస్తుల విలువ ఎంత అనే విషయం వైరల్ గా మారుతోంది. మరి జ్యోతిక ఆస్తి విలువ ఎంతో ఇప్పుడు చూద్దాం.


నిర్మాతగా మారిన జ్యోతిక..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య భార్యగా , హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న జ్యోతిక పుట్టినరోజు ఈరోజు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆస్తులు ఎన్ని కోట్లు? ఆమె సంపాదన ఎంత ?అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. సౌత్ ఫిలిం ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన ఈమె ఉత్తర భారత నటీమణులలో కూడా ఒకరిగా పేరు దక్కించుకుంది. ముంబైకి చెందిన ఈ బ్యూటీ సినీ కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు క్రియేట్ చేసుకుని తెలుగు , తమిళ్ భాషలో వరుస సినిమాలు చేసి తమిళంలోనే సెటిల్ అయిపోయింది . సూర్యతో పూవేళ్లం కేట్టుపార్ , విజయ్ తో ఖుషి, విక్రంతో ధూల్ వంటి వరుస విజయాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.స్టార్ హీరోయిన్ సూర్యతో ప్రేమలో పడి.. కాక్క కాక్క సినిమా షూటింగ్ సమయంలో తన ప్రేమను వ్యక్తపరిచింది.


జ్యోతిక రెమ్యూనరేషన్..

2006లో సూర్యను వివాహం చేసుకున్న ఈమె.. స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని, దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. పిల్లలు పెరిగే వరకు సినిమాలకు దూరంగా ఉన్న ఈమె, ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చి, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతోనే ఆకట్టుకుంది. ముఖ్య నటుల సరసన నటించే అవకాశం వచ్చినా తిరస్కరించిన ఈమె స్కోప్ లేకపోతే సున్నితంగా తిరస్కరించింది కూడా. అందులో రెండు విజయ్ మూవీలు కూడా ఉన్నాయి. ఒకటి  మెర్సల్ , మరొకటి  ఘోస్ట్. ప్రస్తుతం తమిళ్ , మలయాళం, హిందీ భాషల్లో కూడా నటిస్తున్న ఈమె ఒక్కో సినిమాకి రూ.5కోట్ల వరకు పారితోషకం తీసుకుంటోంది.

జ్యోతిక ఆస్తుల విలువ..

ఇవే కాకుండా పలు యాడ్స్ లో కూడా నటిస్తున్న ఈమె వీటి ద్వారా ఏడాదికి రూ.30 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. నటనతో పాటు చిత్ర నిర్మాణంపై కూడా దృష్టి సారించిన జ్యోతిక , సూర్యతో కలిసి 2డి అనే నిర్మాణ సంస్థను నడుపుతోంది. అలా మొత్తంగా రూ.330 కోట్ల ఆస్తులకు ఈమె యజమాని. ఒకరకంగా చెప్పాలి అంటే నటుడు సూర్య కంటే కూడా ఈమె ఆస్తి ఎక్కువ అని వార్తలు వినిపిస్తున్నాయి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×