E-Paper
Advertisement

Suriya:- హీరో సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా

Suriya:- హీరో సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా
Advertisement

Suriya:- కోలీవుడ్ హీరోల్లో చాలా మంది ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేస్తున్నారు, చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంటే హీరో ఏమో కోలీవుడ్ వ్యక్తి అయితే దర్శక నిర్మాతలు మన తెలుగు వారు అయ్యుంటారన్నమాట. అయితే ఇదంతా వారు తమ మార్కెట్ పెంచుకునే ప్రయత్నంలో భాగంగానే చేస్తారు. అయితే ఇప్పటికే తెలుగులో తనకంటూ ఓ మార్కెట్ క్రియేట్ చేసుకున్న తమిళ హీరో సూర్య. ఈయన తెలుగులో స్ట్రయిట్ మూవీ చేస్తానని చాలా కాలంగా చెబుతున్నారు. కానీ సెట్ కాలేదు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న వార్తల మేరకు సూర్య త్వరలోనే స్ట్రయిట్ తెలుగు మూవీ చేయబోతున్నారు.

వివరాల్లోకి వెళితే రీసెంట్‌గా కార్తికేయ 2తో పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన దర్శకుడు చందు మొండేటి చాలా రోజుల నుంచి గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయాల్సి ఉంది. మంచి హీరో సెట్ కావటం లేదు. తెలుగులో కొంత మంది హీరోలను ట్రాక్ ఎక్కించే ప్రయత్నం చేశారు నిర్మాత అల్లు అరవింద్. కానీ ఏవీ వర్కవుట్ కాలేదు. దీంతో సూర్యను రీసెంట్‌గా కలిసి కథ నెరేట్ చేశారట చందు మొండేటి. దానికి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని టాక్.

Advertisement

సూర్య హీరోగా నటించి గజిని చిత్రం నుంచి తర్వాత ఆయనతో సినిమా చేయాలని గీతా ఆర్ట్స్ ప్రయత్నిస్తుంది. అప్పటికే చేయాల్సిన సినిమాలు లైన్‌లో ఉండటం, సరైన ప్రాజెక్ట్స్ సెట్ కాకపోవటం వంటి కారణాలతో సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఈసారి మూవీ స్టార్ట్ కానుందని సినీ సర్కిల్స్ టాక్. ప్రస్తుతం సూర్య పాన్ ఇండియా మూవీ కంగువా సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత వాడి వాసల్ సినిమా చేస్తారంటున్నారు. ఇంత బిజీగా ఉంటున్న సమయంలో కోలీవుడ్ వెర్సటైల్ స్టార్ తెలుగు సినిమాకు ఎప్పుడు డేట్స్ కేటాయిస్తాడనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×