E-Paper
Advertisement

Deepika Padukone: దీపికా మెడపై 82°E టాటూ.. మీనింగ్ ఏంటంటే…

Deepika Padukone: దీపికా మెడపై 82°E టాటూ.. మీనింగ్ ఏంటంటే…

Deepika Padukone: దీపికా పదుకొణె. అందాల భామ. ఇటీవలే పఠాన్‌తో సూపర్ హిట్ కొట్టారు. ఆస్కార్ వేదికపైనా తళుక్కున మెరిశారు. నాటు నాటు సాంగ్‌ను అతిథులకు పరిచయం చేశారు. ఆస్కార్‌లో ఆమె అప్పియరెన్స్ అదుర్స్ అనిపించింది. బ్లాక్ కలర్ గౌన్.. మెడలో సింగిల్ స్టోన్ పెండెంట్‌ నెక్‌పీస్‌తో హొయలు పోయింది. అయితే, దీపికా డ్రెస్సింగ్‌తో పాటు మరో విషయమూ అందరి దృష్టిని ఆకర్షించింది. అదే ఆమె ఒంటిపై కొత్తగా కనిపించిన టాటూ.

మెడపై, ఎడమ చెవికి కొంచెం కిందగా.. 82°E అని టాటూ వేయించుకుంది దీపికా. ఆస్కార్‌ వేడుకకు హాజరైన సందర్భంలో ఆ టాటూ కనిపించింది. గతంలో లేకుండే. ఇటీవలే కొత్తగా వేసినట్టుంది. దీపికా సైతం తన టాటూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఫ్యాన్స్‌లో ఆసక్తి మరింత పెరిగిపోయింది. ‘82°E’ అంటే ఏంటా? అంటూ గూగుల్‌ చేస్తున్నారు.

‘82°E’ అంటే ‘82 డిగ్రీస్‌ ఈస్ట్‌’ అని అర్థం అట. అయితే, ఇదే టాటూ ఎందుకు వేసుకున్నారనే దానికీ రీజన్ లేకపోలేదు. సెలబ్రెటీలు ఊరికే చేయరు ఏ పని కూడా. ప్రతీదానిలో మనీ యాంగిల్ ఉండనే ఉంటుంది.

82°E అనేది దీపికా పదుకొణె కొత్తగా స్టార్ట్ చేసిన స్కిన్‌ కేర్‌ బ్రాండ్‌. ఈ పేరుతో కొన్ని నెలలుగా చర్మ సంరక్షణ ఉత్పత్తులు అమ్ముతున్నారు. తన బిజినెస్ ప్రచారం కోసమే.. మెడపై బ్రాండ్‌నేమ్‌‌ను టాటూగా వేయించుకుంది.

ఇదీ మేటర్. దీపిక కమిట్‌మెంట్ మామూలుగా లేదుగా.. అంటున్నారు ఫ్యాన్స్.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×