Thalapathy Vijay watches Prabhas’ film Salaar at Hyderabad theatre..old video halchal: తమిళనాట విజయ్ దళపతి క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న హీరో విజయ్ దళపతి మాత్రమే. ఈ విషయాన్ని వందల కోట్లు వసూళ్లు చేసిన ఆయన సినిమాలే చెబుతాయి. ఒక్క తమిళనాడే కాదు ప్రస్తుతం దేశం మొత్తం లోనూ గుర్తింపు తెచ్చుకున్న హీరో. ఆయన సినిమాలు విడుదలైతే చాలా తమిళనాట అభిమానులు చేసే కోలాహలం, థియేటర్లలో చేసే హంగామా, హడావిడి మామూలుగా ఉండదు. ఒకప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ లకు మాత్రమే ఈ తరహా వీరాభిమానులు ఉండేవారు. ఇప్పుడు ఆ లిస్టులో విజయ్ దళపతి కూడా చేరిపోయారు.
రాజకీయంగానూ సంచలనం
మొదట్లో విజయ్ కి తెలుగులో అంత క్రేజ్ ఉండేది కాదు. విజయ్ కూడా తెలుగులో మహేష్ బాబు సినిమాలను రీమేక్ చేస్తూ తమిళనాట హిట్ కొట్టేవాడు. అయితే ప్రస్తుతం విజయ్ కి కూడా తెలుగులో మంచి మార్కెట్లే లభిస్తోంది. విజయ్ ప్రస్తుతం తమిళనాట ఓ రాజకీయ పార్టీని నెలకొల్పారు. తమిళగ వెట్రి కజగం పేరుతో ఆ పార్టీ కి చెందిన జెండాను కూడా రీసెంట్ గా ఆవిష్కరించారు. అయితే విజయ్ వ్యక్తిగతంగానూ మానవతా దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. చాలా మంది పేద విద్యార్థులకు ఇప్పటికీ స్కాలర్ షిప్పులు అందిస్తూ వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంా టెన్త్, ప్లస్ టూ పరీక్షలలో టాప్ ర్యాంకులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో వారి చేతుల మీదగానే స్కాలర్ షిప్పులు ఇప్పించారు విజయ్. అంతేకాదు తమిళనాట ఎలాంటి ప్రకృతి భీభత్సాలు జరిగినా..తోటి కళాకారులు ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా తక్షణమే స్పందించే హీరో విజయ్ దళపతి.
పబ్లిక్ గా జనం మధ్య చూసిన మూవీ
విజయ్ దళపతి తోటి హీరోలతోనూ సన్నిహిత సంబంధాలు కలిగివుంటారు. తమిళ హీరోలే కాదు తెలుగు హీరోలతోనూ సన్నిహితంగా ఉంటారు. ఒకసారి విజయ్ తో పరిచయం అయితే ఏ ఒక్కరూ వదిలి వెళ్లిపోరు. అయితే విజయ్ దళపతి గురించి ఎప్పుడో పాత వార్త ఇప్పుడు కొత్తగా హల్ చల్ చేస్తోంది. గత ఏడాది తన మూవీ గోట్ ప్రమోషన్స్ కోసం తెలంగాణకు వచ్చారు విజయ్. మూవీ ప్రచారంలో బిజీబిజీగా గడిపిన విజయ్ కాస్త ఆటవిడుపుగా అప్పుడే రిలీజయి హిట్ టాక్ తో నడుస్తున్న ప్రభాస్ నటించిన సలార్ మూవీని థియేటర్ లో చూడాలని అనుకున్నారు. అది కూడా పబ్లిక్ తో కలిసి ఎంజాయ్ చేయాలని అనుకున్నారు. ఒక సౌత్ సూపర్ స్టార్ అయివుండి ఇలా పబ్లిక్ లో మూవీ చూస్తే ఇంకేమైనా ఉందా? అభిమానులు విరుచుకుపడతారు. మొత్తం థియేటర్ అంతా డిస్ట్రబ్ అవుతుంది. అందుకే సలార్ సింగిల్ స్క్రీన్ థియేటర్ ను ఎంచుకుని రూ.80 రూపాయలు పెట్టి టిక్కెట్ కొనుగోలు చేశారట విజయ్. అయితే విజయ్ తన గెటప్ మార్చేసి సాధారణ ప్రేక్షకుడిలా సలార్ మూవీ చూసి వచ్చాడట.
విజయ్ సింప్లిసిటీ
ఎవరూ విజయ్ ని గుర్తుపట్టకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. మొత్తానికి సీక్రెట్ గా సలార్ మూవీని పబ్లిక్ లో చూడాలనే కోరిక తీర్చుకున్న విజయ్ కు సంబంధించిన మేటర్, విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని నటుడు వైభవ్ బయటపెట్టడం విశేషం. ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. ఒక టాప్ మోస్ట్ హీరో మరో టాప్ మోస్గ్ సినిమాను పబ్లిక్ లో చూడాలని అనుకోవడం నిజంగా ప్రశంసనీయం అని నెటిజెన్స్ విజయ్ చేసిన పనికి అభినందనలు చెబుతున్నారు.
So many interesting news about #Thalapathy shared by #Vaibhav n other co artists from #GOAT in their interviews…#Thalapathy actually even in 1990s used to watch most of the movies in KAMALA THEATRE..#TheGreatestOfAllTime pic.twitter.com/oE2VTv0gmE
— Iʀsʜᴀᴅ (@irshad5005) September 1, 2024