BigTV English

Scholarship scheme: అదిరిపోయే స్కీమ్.. ఇంటర్ పాసైతే చాలు.. ఏడాదికి రూ.20వేలు పొందొచ్చు..

Scholarship scheme: అదిరిపోయే స్కీమ్.. ఇంటర్ పాసైతే చాలు.. ఏడాదికి రూ.20వేలు పొందొచ్చు..
Advertisement

Scholarship scheme: మీరు ఇంటర్ పాసయ్యారా..? ఉన్నత విద్య చదవాలని అనుకుంటున్నారా..? నాణ్యతమైన విద్య కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే ఇది కచ్చితంగా తెలుసుకోండి. కేంద్ర ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ ప్రధాన్ మంత్రి ఉచ్చతర్ శిక్షా ప్రోత్సాహన్ యోజన కింద సెంట్రల్ సెక్టార్ స్కాలర్ షిప్ ఫర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ (పీఎం- యూఎస్‌పీ సీఎస్ఎస్ఎస్) స్కీమ్‌ను రిలీజ్ చేసింది. ఈ స్కాలర్‌షిప్‌ను బ్యాక్ వర్డ్ క్లాసెస్‌కు చెందిన టాలెంట్ ఉన్న స్టూడెంట్స్‌కు పై చదువుల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి మంచి అవకాశాన్ని అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి.


అండర్ గ్రాడ్యుయేట్స్‌కు అయితే ఏడాదికి రూ.12,000, పోస్ట్ గ్రాడ్యుయేట్స్‌కు అయితే రూ.20,000 ప్రోత్సాహకం అందజేయనున్నారు. అక్టోబర్ 31న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆలోగా అర్హత ఉండి ఆసక్తి ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు.

⦿ స్కీం పేరు: సెంట్రల్ సెక్టార్ స్కాలర్‌షిప్ ఫర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ (పీఎం- యూఎస్‌పీ సీఎస్ఎస్ఎస్)


అర్హత: ఇంటర్మీడియట్‌లో 80 శాతం పైగా మార్కులు సాధించి ఉండాలి. స్టూడెంట్స్ రెగ్యులర్ డిగ్రీ కోర్సులు చదవాలి. డిస్టెన్స్ మోడ్ ఉండొద్దు. వేరే ఏ ఇతర గవర్నమెంట్, ప్రైవేట్ స్కాలర్‌షిప్‌లు, రీయింబర్స్‌మెంట్స్ స్కీం లబ్దిదారులు అయి ఉండకూడదు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.4.5 లక్షలకు మించరాదు. కొత్తగా అప్లై చేసుకునే వారికి ఇన్‌కమ్ సర్టిఫికేట్ తప్పనిసరి. ప్రతి సంవత్సరం 50 శాతం మార్కులు, 75 శాతం అటెండెన్స్ ఉండాలి. అలా అయితేనే స్కాలర్‌షిప్‌కు అర్హులవుతారు.

⦿ స్కాలర్‌షిప్ వివరాలు:

అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్: ఏడాదికి రూ.12,000 (మూడేళ్ల పాటు ఏడాదికి ఒకసారి ఇస్తారు)

పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్: ఏడాదికి రూ.20,000 ప్రోత్సాహం ఉంటుంది.

ఇంటిగ్రేటెడ్, ప్రొఫెషనల్ కోర్సులు: నాలుగు, ఐదో సంవత్సరానికి రూ.20,000 స్కాలర్ షిప్ అందజేస్తారు.

⦿ వయస్సు: ఈ స్కీంకు అప్లై చేసుకునే విద్యార్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

⦿ అప్లికేషన్ ప్రాసెస్: అర్హత ఉన్న స్టూడెంట్స్ నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (www.scholarships.gov.in) ద్వారా ఆన్‌లైన్ అప్లై చేసుకోవాలి. నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో నమోదు చేసుకుని.. కావాల్సిస సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసి అప్లై చేసుకోవాలి. అప్లికేషన్‌ను కాలేజ్, రాష్ట్ర నోడల్ ఏజెన్సీ ద్వారా చెక్ చేస్తారు.

⦿ కావాల్సిన సర్టిఫికెట్స్:

ఇంటర్ మాక్స్ మెమో, ఇన్‌కామ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటైల్స్, కాలేజ్ ఆడ్మిషన్ రిసీప్ట్, ఆర్గనైజేషన్ ఏఐఎస్‌హెచ్ఈ కోడ్, కేటగిరి సర్టిఫికెట్ ఉంటే చాలు..

⦿ అప్లికేషన్ లాస్ట్ డేట్: 2025 అక్టోబర్ 31

⦿ అఫీషియల్ వెబ్ సైట్: https://scholarships.gov.in/

అర్హత ఉన్న వారు ఇలాంటి గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకోవద్దు. ఉన్నత విద్య కోసం ఈ స్కాలర్ షిప్‌ను వాడుకోండి. ఇంటర్మీడియట్‌లో 80 శాతం పైగా మార్కులు సాధించి ఉండాలి. స్టూడెంట్స్ రెగ్యులర్ డిగ్రీ కోర్సులు చదవాలి. డిస్టెన్స్ మోడ్ ఉండొద్దు. వేరే ఏ ఇతర గవర్నమెంట్, ప్రైవేట్ స్కాలర్‌షిప్‌లు, రీయింబర్స్‌మెంట్స్ స్కీం లబ్దిదారులు అయి ఉండకూడదు.

ALSO READ: Weather News: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రాబోయే 24 గంటలు జాగ్రత్త, ఈ జిల్లాల్లో?

Related News

Maoist Party: మల్లోజుల లొంగుబాటుపై మావోయిస్ట్ పార్టీ సంచలన లేఖ

Pakistan – Afghanistan: ఉద్రిక్తతలకు తెర.. కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్థాన్ -అఫ్గానిస్థాన్

Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ‘బ్రహ్మోస్’ పాక్ తాట తీస్తుంది: రాజ్ నాథ్ సింగ్

Transgenders Suicide Attempt: ఫినైల్ తాగేసి ఆత్మహత్యకు ప్రయత్నించిన 24 మంది హిజ్రాలు.. అసలు ఏమైంది?

Heavy Rains: ఈశాన్య రుతుపవనాలు ఎంట్రీ.. ఓ వైపు వాయుగుండం, ఇంకోవైపు అల్పపీడనం

Gujarat Ministers Resign: గుజరాత్ కేబినెట్ మొత్తం రాజీనామా.. ఎందుకంటే?

Maoist Surrender: ల్యాండ్ మార్క్ డే! 2 రోజుల్లో 258 మంది.. మావోయిస్టుల లొంగుబాటుపై అమిత షా ట్వీట్

Bangalore News: నారా లోకేశ్ కామెంట్స్.. డీకే శివకుమార్ రిప్లై, బెంగళూరుకు సాటి లేదని వ్యాఖ్య

Big Stories

×