రీసెంట్ గా స్పైస్ జెట్ విమానంలో ఓ వ్యక్తి దుబాయ్ నుంచి ముంబైకి రావాలనుకున్నాడు. కానీ, ఆ విమానం ఏకంగా 14 గంటలు ఆలస్యమైంది. ఫ్లైట్ కోసం పడిగాపులు కాసిన ఓ ప్రయాణీకుడికి సరైన ఫుడ్ కూడా అరేంజ్ చేయలేదు విమానయాన సంస్థ. కేవలం బర్గర్, ఫ్రైస్ మాత్రమే ఇచ్చింది. తనను వెయిట్ చేయించడమే కాకుండా, సరైన ఫుడ్ కూడా పెట్టలేదని ఫలితంగా తాను ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చిందని సదరు ప్రయాణీకుడు ముంబైలోని వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు.
ఈ ఘటనపై వినియోగదారుల ఫోరం విచారణ జరిపింది. సదరు ప్రయాణీకుడికి ఇబ్బంది కలిగించినందుకు గాను.. AED 2,300.. భారత కరెన్సీలో సుమారు రూ. 55 వేలు పరిహారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. విమానం ఆలస్యం అయిన సమయంలో సదరు విమానయాన సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడం పైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణీకులకు సరైన భోజనం, తాగునీరు, విశ్రాంతి సౌకర్యాలు ఎలా అందించాలో ప్యానెల్ ప్రస్తావించింది. సుదీర్ఘ అంతరాయం సమయంలో వారికి సకాలంలో అప్ డేట్స్ కూడా అందించాలని అభిప్రాయపడింది. సరైన ఏర్పాట్లు చేయని కారణంగా పరిహారం ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది.
కొన్నిసార్లు విమానాలు ఆలస్యం కావడంతో పాటు అకస్మాత్తుగా రద్దు అవుతాయి. అటువంటి సందర్భాలలో టికెట్ రద్దు చేసుకొని, రీఫండ్ పొందే అవకాశం ఉంటుందా? అని చాలా మంచి ఆలోచిస్తారు. అయితే, ఒక వ్యక్తి విమాన టికెట్ బుక్ చేసుకున్నప్పుడు, వారు కొన్ని నిబంధనలు, షరతులకు అంగీకరిస్తారు. UAEలో ప్రయాణిస్తున్నప్పుడు, ప్రయాణీకులు విమాన టికెట్ ఈ నిబంధనలు, షరతుల ద్వారా నియంత్రించబడతారు. అయితే, షెడ్యూల్ చేయబడిన విమానాలలో ఆలస్యం జరిగితే విమానయాన సంస్థలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అన్నింటికంటే, ప్రయాణీకుల రాక, తనిఖీ చేయబడిన లగేజీ ఆలస్యంగా చేరుకోవడం వల్ల కలిగే నష్టానికి వారు బాధ్యత వహిస్తారు.
Read Also: యూకే వెళ్లే ఫ్లైట్ మిస్, పోలీసుకు రూ. 2 లక్షల జరిమానా!
కాబట్టి ప్రాథమికంగా, 1999 మాంట్రియల్ కన్వెన్షన్ ప్రకారం ఎయిర్ లైన్ నియంత్రణకు సంబంధించి ఉంటే ఆలస్యాలకు ఎయిర్ లైన్స్ బాధ్యత వహిస్తాయి. UAE ఈ కన్వెన్షన్ కు సంతకం చేసింది. కాబట్టి, సదరు ప్రయాణీకుడికి జరిమానా కట్టాల్సి వచ్చింది. స్పైస్ జెట్ విమానయాన సంస్థకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు అయ్యింది. సదరు ప్రయాణీకులు వినియోగదారుల ఫోరం తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Read Also: డిసెంబర్‌లో కేరళ, కశ్మీర్ ట్రిప్‌కు వెళ్లాలా? అదిరిపోయే డిస్కౌంట్స్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ!