Venky Atluri: తొలిప్రేమ సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు వెంకీ అట్లూరి. వెంకీ అట్లూరి దర్శకుడు కాకముందు హీరోగా కూడా సినిమా చేశాడు. ఆ సినిమా అసలు వచ్చినట్లు చాలామందికి తెలియదు. కొన్ని రోజులు తర్వాత స్నేహగీతం అనే సినిమాకి రచయితగాను పనిచేస్తూ మరోవైపు నటుడుగా కూడా ఎంట్రీ ఇచ్చాడు.
మొత్తానికి చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత దర్శకుడుగా తొలిప్రేమ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్నాడు. వరుణ్ తేజ్ నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. వెంకీ అట్లూరికి వరుస అవకాశాలు తీసుకొచ్చింది. తొలిప్రేమ సినిమా తర్వాత వచ్చిన మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేదు. అంతేకాకుండా ఈ మూడు సినిమాల్లో కూడా లండన్ ట్రిప్ ఖచ్చితంగా ఉండేది. దీని మీద అప్పట్లో వెంకీ పైన విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. అప్పుడు ధనుష్ హీరోగా సార్ సినిమా చేశాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. ఇప్పుడు మంచి సక్సెస్ లో ఉన్నాడు వెంకీ అట్లూరి.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో సూర్యదేవర నాగ వంశీ ఒకరు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నాగ వంశీ సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. కేవలం సినిమాలను నిర్మించడమే కాకుండా కొన్ని ప్రాజెక్టులను డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తారు. అలా లేటెస్ట్ గా నాగ వంశీ డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమా కొత్తలోక.
బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఇప్పుడు సంచలనంగా మారింది. దాదాపు 100 కోట్లకు పైగా ఇప్పటికే కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో వెంకి అట్లూరి నాగ వంశీని ఉద్దేశించి మాట్లాడారు.
ఆగస్టులో మాట పడ్డారు, ఆగస్టు మంత్ చివరలో సమాధానం చెప్పారు అంటూ వెంకీ అట్లూరి చెప్పాడు. దీనిని బట్టి విషయం అందరికీ అర్థమైపోయి ఉంటుంది. భారీ రేటుకు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమాను కొన్నాడు నాగ వంశీ. అలానే ఆ సినిమా గురించి బీభత్సమైన ఎలివేషన్ కూడా ఇచ్చాడు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. అందుకనే వెంకీ ఆగస్టు 14న వచ్చిన సినిమాను గుర్తు చేస్తూ, ఆగస్టు ఎండింగ్ లో రిలీజ్ అయిన కొత్తలోక సినిమాను కూడా పోలిస్తూ నాగ వంశీకి ఆ మాట అన్నాడు.
వెంకీ అట్లూరి ఈ మాట మాట్లాడిన తర్వాత నాగ వంశీ తనలో తాను నవ్వుకోవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే నాగ వంశీకి కూడా పరిస్థితి అర్థమైపోయింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమా తేడా కొట్టడంతో కొత్తలోక ఈవెంట్ లో కూడా నాగ వంశీ పెద్దగా ఏమి మాట్లాడలేదు.
Also Read: Anushka Shetty : అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ బానే సెట్ చేసింది, స్వీటీ అభిమానులకు పండగే