Dulquar Salman : నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు దుల్కర్ సల్మాన్. దుల్కర్ మహానటి సినిమా చేయడానికి అంటే ముందే చాలామంది తెలుగు ప్రేక్షకులకు పరిచయం. దుల్కర్ చేసిన చాలా సినిమాను తెలుగు ప్రేక్షకులు మలయాళంలో వెతికి మరి చూశారు.
మహానటి సినిమాలో జెమినీ గణేషన్ అనే పాత్రలో కనిపించాడు దుల్కర్. ఈపాత్ర మంచి పేరు తీసుకొచ్చింది. మంచి పేరు తీసుకురావడమే కాకుండా చాలామంది తెలుగు ప్రేక్షకులకు దుల్కర్ ను దగ్గర చేసింది. ఇప్పటివరకు దుల్కర్ సల్మాన్ తెలుగులో చేసిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం, వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన లక్కీ భాస్కర్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి ఈ అన్ని సినిమాలు కూడా దుల్కర్ కి మంచి పేరుని తీసుకొచ్చాయి. అలానే తెలుగులో పలు ప్రాజెక్ట్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు దుల్కర్ సల్మాన్.
చాలామంది హీరోలు ఒకపక్క నటులుగా సక్సెస్ అవుతూ కూడా నిర్మాతలుగా అడుగులు వేయడం మొదలు పెడుతున్నారు. దుల్కర్ సల్మాన్ నిర్మాతగా నిర్మించిన సినిమా కొత్తలోక. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సంచలనం సృష్టిస్తుంది. ఇది ఒక సూపర్ హీరో ఫిలిం. ఈ సినిమాకి మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఇప్పటికే వంద కోట్లకు పైగా కలెక్షన్స్ ఈ సినిమాకు వచ్చాయి. ఈ తరుణంలో చిత్ర యూనిట్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించింది.
ఈ ఈవెంట్లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ…కళ్యాణి ప్రియదర్శిని నాకు చెల్లి లాంటిది. నేను కళ్యాణి చాలా సిమిలర్ గా ఉంటాం. నాకు తెలిసి మేమిద్దరం గత జన్మలో కవలపిల్లడం అయి ఉంటాం. నాకు సేమ్ వర్రీస్, సేమ్ ఇన్ సెక్యూరిటీస్ ఉంటాయి. చంద్ర అనే పాత్రను లోకా సినిమాలో అనుకున్నప్పుడు ఎవరు దీనిని ప్లే చేస్తారు అని చాలా ఆలోచనలు ఉండేవి. డిసెంబర్లో కళ్యాణ్ ప్రియదర్శిని ఈ ప్రాజెక్టులోకి వచ్చింది మేము జూన్ నుంచి షూటింగ్ మొదలుపెట్టాము. ప్రొడక్షన్ గురించి డైరెక్టర్ గురించి ఆలోచించకుండా నేను ఒక సూపర్ హీరో ఫిలిం చేస్తాను అని చెప్పి తనకు తాను ట్రైనింగ్ చేసుకుంది. అంటూ మాట్లాడారు.
ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ రెస్పాన్స్ వస్తుంది. ఒక సినిమా బాగుంది అని మౌత్ నాకు వినిపించినప్పుడు తెలుగు ఆడియన్స్ కచ్చితంగా ఆ సినిమాను చూడటానికి ఇష్టపడతారు. ఈ సినిమా విషయంలో కూడా అలానే జరిగింది. అందుకే కేవలం 30 కోట్లు పెట్టిన సినిమా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాను తెలుగులో సూర్యదేవర నాగ వంశి డిస్ట్రిబ్యూట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది.
Also Read: Venky Atluri: స్టేజ్ పైనే నాగ వంశీ పరువు తీసేసిన దర్శకుడు వెంకీ అట్లూరి