BigTV English

Naga Vamsi: స్పీచ్ లు వద్దులెండి మేడం, ఒక్క దెబ్బతో నాగ వంశీ ఎంత మారిపోయాడో?

Naga Vamsi: స్పీచ్ లు వద్దులెండి మేడం, ఒక్క దెబ్బతో నాగ వంశీ ఎంత మారిపోయాడో?

Naga Vamsi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో నాగ వంశీ ఒకరు. హారిక హాసిని క్రియేషన్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే సినిమాలు చేస్తారు అనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ ప్రొడక్షన్ హౌస్ మిగతా దర్శకులతో సినిమాలు చేయాలి కాబట్టి దానికి అనుసంధానంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించారు.


సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రొడ్యూసర్ గా నాగ వంశీ సినిమాలు చేస్తాడు. ఈ బ్యానర్ లో ఇప్పటివరకు చాలా అద్భుతమైన సినిమాలు వచ్చాయి. జెర్సీ లాంటి నేషనల్ అవార్డు సినిమాను తెరకెక్కించిన ఘనత ఈ బ్యానర్ కి ఉంది. అయితే ఇప్పుడు ఉన్న ప్రొడ్యూసర్స్ లో మంచి పేరు సంపాదించుకున్న ప్రొడ్యూసర్ కూడా నాగ వంశీ. ఎంత పేరు సంపాదించినా కూడా ఆ పేరు పోవడానికి ఒక క్షణం చాలు. దీనిని కొత్తగా చెప్పక్కర్లేదు ఇండస్ట్రీలోనే చాలా ఉదాహరణలు ఉన్నాయి. దాదాపు నాగ వంశీ జీవితంలో కూడా అలాంటి పరిణామాలు జరిగాయి.

స్పీచ్ లు వద్దులెండి 

నాగ వంశీ ఒక సినిమా గురించి మాట్లాడితే చాలా అనర్గళంగా చెప్తాడు. సినిమా మీద తన మాటలతో విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తాడు. ఇలా నాగ వంశీ ఇచ్చిన హైప్ వలన డిజాస్టర్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. నాగ వంశి మాట్లాడుతూ కింగ్డమ్ సినిమా గురించి భారీ ఎలివేషన్ ఇచ్చాడు. అలానే ఆ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. తీరా సినిమా చూస్తే అంచనాలను అందుకోలేకపోయింది. అప్పుడు చాలామంది నాగవంశీ ను టార్గెట్ చేసి ట్విట్టర్లో కామెంట్లు చేశారు.


నాగ వంశీ స్వతహాగా ఎన్టీఆర్ కు వీరాభిమాని. దేవర సినిమాను కూడా కొని తెలుగు స్టేట్స్ లో డిస్ట్రిబ్యూషన్ చేశాడు. కొంతమేరకు ఆ సినిమా మంచి లాభాలను కూడా తీసుకొచ్చింది. అలానే రీసెంట్ గా హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించిన సినిమా వార్ 2. కూలి సినిమాతో పాటు ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాని తెలుగు స్టేట్స్ లో డిస్ట్రిబ్యూషన్ చేశాడు నాగ వంశీ. ఈ సినిమా కూడా భారీ ఎలివేషన్ ఇచ్చాడు. కానీ సినిమా మాత్రం డిజాస్టర్ అయిపోయింది. ఆ తర్వాత నాగ వంశీ కనిపించట్లేదు అంటూ కొన్ని కథనాలు కూడా వినిపించాయి. అందుకే ఇప్పుడు కొత్త లోక సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడమంటే స్పీచ్ లు ఎందుకులెండి అంటూ సైడ్ అయిపోయాడు.

ఒక్క దెబ్బతో మారిపోయాడు 

మామూలుగా నాగ వంశి డిస్ట్రిబ్యూషన్ చేసిన, సినిమాను నిర్మించిన ఆ సినిమా గురించి అనర్గంగా కొన్ని నిమిషాల పాటు మాట్లాడుతాడు. అయితే వార్ సినిమా ఇచ్చిన ఎక్స్పీరియన్స్ బట్టి. కొత్త లోక సినిమాకి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నా కూడా స్పీచ్ లు ఎందుకు అని సైలెంట్ అయిపోయాడు. వార్ 2 సినిమా దెబ్బతో కంప్లీట్ గా మారిపోయాడు నాగ వంశీ అని చెప్పాలి.

Also Read: Dulquar Salman : గత జన్మలో కళ్యాణి నేను కవలపిల్లలం

Related News

Dulquar Salman : గత జన్మలో కళ్యాణి నేను కవలపిల్లలం

Venky Atluri: స్టేజ్ పైనే నాగ వంశీ పరువు తీసేసిన దర్శకుడు వెంకీ అట్లూరి

Kishkindhapuri : హర్రర్ సినిమా అన్నారు, ఎక్కడ భయపడాలో కూడా చెప్పండి

Bollywood: 15 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ.. విడాకులు ప్రకటించిన బాలీవుడ్ నటి!

Anushka Shetty : అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ బానే సెట్ చేసింది, స్వీటీ అభిమానులకు పండగే

Big Stories

×