వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సినీ నటి, యాంకర్ శ్యామలకు సంబంధించిన ఓ వీడియో ఇటీవల కాలంలో వైరల్ గా మారింది. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఈ వీడియో తీసినట్టుగా తెలుస్తోంది. ఈ వైరల్ వీడియోని మరింత వైరల్ గా మార్చేశారు జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పీ. ఆ వీడియోని ప్లే చేస్తూ అందులో శ్యామల నటనను ట్రోల్ చేశాడు. ఒకరకంగా చెప్పాలంటే అసలు వీడియో కంటే, కిరాక్ ఆర్పీ చేసిన ట్రోలింగ్ వీడియోనే మరింత వైరల్ గా మారింది.
ఆ వీడియోలో ఏముంది..?
కిరాక్ ఆర్పీ ట్రోలింగ్ చేసిన ఆ వీడియోలో యాంకర్ శ్యామల స్టేజ్ పై నడుచుకుంటూ వస్తుంటారు. ఎదురుగా స్టేజ్ కింద ఓ వ్యక్తి శ్యామలకోసం అన్నట్టుగా చేతిలో కర్పూరం వెలిగించి హారతి ఇస్తుంటాడు. ఆ హారతిని చూసిన శ్యామల వెంటనే దగ్గరకు వచ్చి అలా వద్దు అన్నట్టుగా తల ఊపుతుంది. ఆ తర్వాత ఆ హారతిని కళ్లకు అద్దుకుంటుంది. ఈ వీడియోకి సీతయ్య సినిమాలో బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. శ్యామలకు కూడా హారతులిచ్చే స్థాయిలో భక్తులున్నారంటూ ఆ వీడియోకి వైసీపీ అభిమానులు కామెంట్లు పెట్టారు.
ఆర్పీ ఎంట్రీ..
ఈ వీడియోతో శ్యామలకు ఓ రేంజ్ లో ఎలివేషన్లు వచ్చాయి. శ్యామల వీడియో వైరల్ కావడంతో వెంటనే కిరాక్ ఆర్పీ ఎంట్రీ ఇచ్చారు. ఓ రేంజ్ లో ట్రోలింగ్ మొదలు పెట్టారు. యాక్టింగ్ నేర్చుకోవాలనుకున్నా, సినిమాల్లోకి రావాలనుకున్నా శ్యామలనే అందరూ ఫాలో కావాలన్నారు. ఆ వీడియోలో శ్యామల యాక్టింగ్ సూపర్ అంటూ పరువు తీసేశారు. అసలు శ్యామల ఏం సాధించిందని ఆమెకు హారతులిస్తారంటూ సూటిగా ప్రశ్నించారు ఆర్పీ. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి యువత ప్రాణాలు తీసినందుకు ఆమెకు హారతులివ్వాలా అని అడిగారు. పోనీ రాజకీయాల్లో ఏమయినా సాధించారా అన్నారు. అంతే కాదు, శ్యామల హారతిపై ఏకంగా ఓ పాట పాడి నవ్వులు పూయించారు ఆర్పీ. వైసీపీ అధికార ప్రతినిధిగా చేరిన తర్వాత శ్యామలకు నటించే అవకాశాలు తక్కువయ్యాయని, అందుకే ఒక్కసారిగా ఆమె విజృంభించారన్నారు ఆర్పీ. సినిమాలు, సీరియల్లు, స్కిట్లు, షోలు, ఈవెంట్లు లేకపోవడంతో ఉన్న ఒక్క అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. హారతి తీసుకునే సన్నివేశంలో శ్యామల నటన హైలైట్ అన్నారు కిరాక్ ఆర్పీ.
శ్యామలకు కాంపిటీషన్..
ఎలివేషన్లతో శ్యామల తనను తాను ప్రమోట్ చేసుకుంటుంటే.. ఆమెకు వైసీపీ నుంచి కాంపిటీషన్ ఉందని అన్నారు ఆర్పీ. విడదల రజిని, రోజా, లక్ష్మీపార్వతికి.. శ్యామల అంటే గిట్టడం లేదన్నారు. వాళ్లంతా జగన్ పై కోపంతో ఉంటారన్నారు. వారందర్నీ దాటి ఎమ్మెల్యే టికెట్ కోసం శ్యామల విపరీతంగా ట్రై చేస్తున్నారని చెప్పుకొచ్చారు ఆర్పీ. మొత్తమ్మీద యాంకర్ శ్యామల వీడియోని ట్రోల్ చేస్తూ తన వీడియోతో హైలైట్ అయ్యారు కిరాక్ ఆర్పీ. శ్యామల హారతి వీడియో గురించి తెలియని వారికి కూడా తెలిసొచ్చేలా చేశారు.