SivaJyothi: తీన్మార్ వార్తలు ద్వారా సావిత్రిగా (Savitri)ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శివ జ్యోతి (Siva Jyothi)తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా తీన్మార్ వార్తలు ద్వారా యాంకర్ గా మంచి సక్సెస్ అందుకున్న ఈమె సినిమా ప్రమోషన్ల టైం లో పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలను కూడా ఇంటర్వ్యూ చేస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్(Bigg Boss) అవకాశాన్ని కూడా అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శివ జ్యోతి ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో పాల్కొట్టు సందడి చేస్తున్నారు. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన విషయాలన్నీ కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.
పిల్లల కోసం పూజలు, వ్రతాలు..
ఇకపోతే ఇటీవల కాలంలో శివ జ్యోతి తరచు వార్తలు నిలుస్తున్న సంగతి తెలిసిందే .ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటూ ఈమె పేరు కూడా తెరపైకి రావడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా శివ జ్యోతి వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె గంగూలీ(Ganguli) అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం జరిగి దాదాపు 8 సంవత్సరాలవుతుంది. ఇప్పటివరకు పిల్లలు లేరని చెప్పాలి అయితే తాము పిల్లల్ని ప్లాన్ చేస్తున్నామని త్వరలోనే తమ కోరిక నెరవేరాలి అంటూ ఇటీవల ఒక కార్యక్రమంలో కాస్త ఎమోషనల్ అయ్యారు.
బేబీ బంప్ తో శివ జ్యోతి..
ఇక ఈమె పిల్లల కోసం పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు కూడా చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. అయితే తాజాగా శివ జ్యోతి వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ప్రత్యేకంగా పూజలను నిర్వహించారు. తన భర్తతో కలిసి ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు. ఇక ఈ పూజా కార్యక్రమాల అనంతరం శివ జ్యోతి సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేయడంతో ఈమె ప్రెగ్నెన్సీ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలలో భాగంగా శివ జ్యోతి బేబీ బంప్ (Baby Bump) క్లియర్ గా కనిపిస్తున్న నేపథ్యంలో శివ జ్యోతి తల్లి కాబోతోందా? బుల్లి సావిత్రి రాబోతోందా? అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేయడమే కాకుండా ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇలా శివజ్యోతి తల్లి కాబోతుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై శివ జ్యోతి ఎక్కడ స్పందించలేదు అలాగే తన ప్రేగ్నెన్సీ(Pregnancy) గురించి కూడా ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ప్రెగ్నెన్సీ విషయాన్ని ఈమె రహస్యంగా ఉంచబోతున్నారా? లేదంటే ఆమె డ్రెస్ కారణంగానే అలా కనిపిస్తున్నారా అనేది తెలియాలి అంటే శివ జ్యోతి ఈ వార్తలపై స్పందించాల్సి ఉంది. అయితే ఈమె పిల్లల కోసమే ఇటీవల ప్రత్యేకంగా వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సంతాన లక్ష్మీ వ్రతాన్ని కూడా ఆచరించిన సంగతి తెలిసిందే. మరి ఈమె ప్రెగ్నెన్సీ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి ఆమె స్పందించే వరకు వేచి చూడాల్సిందే.
Also Read: Manchu Manoj: మిరాయ్ 2 కూడా ఉండబోతోందా.. అసలు విషయం చెప్పిన మనోజ్?