Electronics ‘repairability index’: మొబైల్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై డిసెంబర్ లోగా రిపేరెబిలిటీ ఇండెక్స్ సూచిక ఉండాలని కేంద్ర ప్రభుత్వం త్వరలో చట్టం తీసుకురానుంది. ఈ సూచిక వినియోగదారులకు ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసే ముందు సరైన వస్తువు ఎంపిక చేసుకోవడానికి సాయ పడుతుంది. పైగా ప్రపంచంలో పెరిగిపోతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాల సమస్యను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఈ సూచిక తప్పనిసరి చేస్తే.. ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ కంపెనీలు మరింత నాణ్యత గల ఉత్పత్తులను తయారు చేసేందుకు దోహద పడుతుంది.
తక్కువ రిపేర్లు లేదా సులువుగా రిపేరు చేయగల ఉత్పత్తులు వినియోగదారులకు అందించడమే ‘రిపేరెబిలిటీ ఇండెక్స్’ లక్ష్యం. ఇటీవల ‘రైట్ టు రిపేర్ ఫ్రేమ్‌వర్క్’ అనే వర్క్ షాప్ ని ప్రభుత్వం నిర్వహించింది. ఈ వర్క్ షాప్ లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే మాట్లాడుతూ.. ప్రభుత్వం త్వరలోనే ఈ అంశంపై చట్టం తీసుకురానుందని.. నిబంధనల రూపకల్పన జరుగుతోందని ప్రకటించారు.
భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తున్న తరుణంలో దేశ వ్యాప్తంగా సమర్థవంతమైన ఎలక్ట్రానిక్ రిపేర్ వ్యవస్థ ఉండాలని నిధి ఖరే సూచించారు. దేశంలోని ప్రధాన ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ కంపెనీలు ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. ఈ చట్టం అమలులోకి రాగానే కంపెనీ తమ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై తప్పనిసరిగా రిపేరెబిలిటీ ఇండెక్స్ సూచికలను డిస్ప్లే చేయాలి. ఇలాంటి నిబంధనలు ఇప్పటికే ఫ్రాన్స్ దేశంలో అమలులో ఉన్నాయి.
రిపేరెబిలిటీ ఇండెక్స్ చట్టంలో ప్రతిపాదనలో కీలక విషయాలు
-రిపేరెబిలిటీ ఇండెక్స్ సూచికలో ఎలక్ట్రానిక్ ఉపకరణాల టెక్నికల్ వివరాలు, ఉపకరణాలు విడగొట్టేందుకు సులువుగా ఉండడం, వాటి స్పేర్ పార్ట్ అందుబాటులో ఉండాలి, స్పేర్ పార్ట్స్ ధరలు ఉంటాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని వాటి రిపేరెబిలిటీ ఇండెక్స్ రేటింగ్ ఉంటుంది.
-ఏదైనా మొబైల్ ఫోన్, టీవి, లాప్ టాప్ లాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణంలో సమస్య వస్తే.. అవి సులువుగా రిపేరు చేసే విధంగా ఉండాలి. దీని వల్ల ఈ- వ్యర్థాల సమస్య కొంతవరకు తగ్గుతుంది.
రిపేరెబిలిటీ ఇండెక్స్ సూచికలో ఎలక్ట్రానిక్ ఉపకరణాల రేటింగ్ 1 నుంచి 5 వరకు ఉంటుంది. త్వరగా లేదా సులువుగా డ్యామేజ్ అయ్యే ప్రమాదముంటే దానికి 1 రేటింగ్ ఉంటుంది. అదే ఎంత సులువుగా -రిపేర్ చేయడానికి వీలుంటే, స్పేర్ పార్ట్స్ అందుబాటుని బట్టి రేటింగ్ గరిష్టంగా 5 వరకు ఉంటుంది.
-అయితే రిపేరెబిలిటీ ఇండెక్స్ చట్టం తయారీలో దేశంలోని అన్ని కంపెనీలు సహకరించాలని ప్రభుత్వం కోరింది. ఎలక్ట్రానిక్ ప్రాడక్ట్స్ ఎక్కువ కాలం మన్నిక, ఎక్కడైనా సులువుగా రిపేర్ చేసుకోవచ్చనే సమాచారం వినియోగదారుడి ఉపకరిస్తుందని.. అందువల్ల మొబైల ఫోన్, ఇతర ప్రాడక్స్ రీయూజింగ్ పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: ట్రైన్ లేట్ అయితే మీ డబ్బులు ఫుల్ రిఫండ్.. షరతులు వర్తిస్తాయి!
మరోవైపు స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి ఇండియన్ కస్టమర్లకు లిమిటెడ్ టైమ్ ఆఫర్ ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ల బ్యాటరీ రిప్లేస్ మెంట్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. రెడ్ మి, ఇతర షావోమి ఫోన్లపై సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. షావోమి మిక్స్ 4, షావోమి 12s అల్ట్రా, రెడ్ మీ నోట్ 11 ప్రో, రెడ్ మి కె30 ప్రొ మొబైల్ ఫోన్స్ పై ఈ ఆఫర్లు ఉన్నాయి.