Heinrich Classen: సౌతాఫ్రికా వికెట్ కీపర్, విధ్వంసకర బ్యాట్స్ మెన్ హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) ఇటీవలే అంతార్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. 33 ఏళ్ల వయస్సు ల్లోనే సంచలన నిర్ణయం తీసుకోవడం.. అభిమానులను కాస్త ఆందోళనకు గురి చేశాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (sun risers hyderabad) తరపున ఆడే క్లాసెన్.. తెలుగు రాష్ట్రాల అభిమానులకు చాలా ఇష్టమైన ఆటగాడిగా పేర్గాంచాడు. ఈ నేపథ్యంలోనే క్లాసెన్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అది ఏంటంటే..? క్లాసెన్ నెలకొక టోర్నమెంట్ ఆడుతాడని.. ప్రపంచంలోనే బిజీయ్యస్ట్ క్రికెటర్ అని సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.
Also Read : Ms Dhoni : MS ధోనీనే నా స్ఫూర్తి.. ఆయన రియల్ హీరో.. పాకిస్తాన్ కెప్టెన్ సంచలనం
సౌతాఫ్రికా క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) జనవరిలో సౌతాఫ్రికా 20 ఆడి ర్యాండ్ సంపాదిస్తాడు. మార్చి నుంచి మే వరకు ఐపీఎల్ రూపాయలు, జూన్ లో యూఎస్ డాలర్స్, ఎమ్మెల్సీ, జులై పౌండ్స్, హండ్రెడ్స్ సంపాదిస్తాడు. మిగిలిన నెలల్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో గడుపుతాడు క్లాసెన్. చాలా బిజీ క్రికెటర్ అని సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేయడం విశేషం. ఐపీఎల్ (IPL) లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడే క్లాసెన్.. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. సిక్స్ లు కొట్టి అందరి అభిమానులుగా మారాడు. మరోవైపు ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ మాక్స్ వెల్ (maxwell) వన్డే క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది గంటల తరువాత క్లాసెన్ ప్రకటన చేయడం విశేషం. ఇక ఈ ఏడాది చాలా మంది స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohith Sharma) కూడా టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం మేజర్ లీగ్ క్రికెట్ (MLC), ది హండ్రెడ్ లీగ్ ల్లో ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. త్వరలో జరిగే జింబాబ్వే-న్యూజిలాండ్ ట్రై నేషన్ సిరీస్, ఆస్ట్రేలియా వైట్ బాల్ పర్యటనకు దూరంగా ఉండనున్నాడు. రెండున్నర సంవత్సరాల కుమార్తెకు తండ్రిగా ఉన్న క్లాసెన్.. తన కుటుంబంతో సమయం గడపటం కోసం క్రికెట్ కి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరమని వివరించాడు క్లాసెన్. ప్రధానంగా సౌతాఫ్రికా తరపున అన్ని ఫార్మాట్ లలో చాలా అద్భుతంగా రాణించాడు. స్పిన్నర్ల ధాటిగా ఎదుర్కొంటూ తన విప్పింగ్ పుల్ షాట్లతో అభిమానులను అలరించాడు క్లాసెన్. ఇటీవల జరిగిన ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్ కప్ 2023,టీ 20 వరల్డ్ కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సౌతాఫ్రికా కి ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఇటీవల అతని రిటైర్మెంట్ వ్యవహారం అభిమానులను కాస్త నిరాశ గురి చేసినప్పటికీ.. తన వ్యక్తిగత కారణాల కోసం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చాలా మంది గౌరవాన్ని వ్యక్తం చేసాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం క్లాసెన్ గురించి వార్త వైరల్ అవుతోంది.