E-Paper
Advertisement

Saripodhaa Sanivaaram: ఎంత ‘ఉల్లాసం’గా ఉంది ఈ పాట.. నాని మెలోడీస్ లిస్ట్ లో మరొకటి

Saripodhaa Sanivaaram: ఎంత ‘ఉల్లాసం’గా ఉంది ఈ పాట.. నాని మెలోడీస్ లిస్ట్ లో మరొకటి

Saripodhaa Sanivaaram: న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సరిపోదా శనివారం. ఈ సినిమాను డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక గరం గరం అంటూ వచ్చిన మొదటి సాంగ్ కూడా చార్ట్ బస్టర్ లిస్ట్ లో చేరింది. తాజాగా ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఉల్లాసం అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సూర్యగా నాని, చారులత గా ప్రియాంక కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టే క్షణాలను.. లిరిక్స్ గా రాసిన విధానం ఆకట్టుకుంటుంది.

వైలెన్స్ అంటే ఇష్టమే లేని చారును ఇంప్రెస్ చేయడానికి అసలు వైలెన్స్ లో ఎన్ని ఎస్ లు ఉంటాయని అడిగి.. సూర్య కలిపిన పులిహోరతోనే సాంగ్ మొదలయ్యింది. ఆ తరువాత వీరి ఇద్దరి మధ్య జరిగిన ప్రయాణమే సాంగ్ విజువల్స్ లో చూపించారు. సనారే లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను సంజిత్ హెగ్డే, కృష్ణ లాస్య ముత్యాల ఆలపించారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ఎంతో రిఫ్రెష్ గా అనిపిస్తుంది.

ఇక సాంగ్ అంతా ఒక హైలైట్ అయితే నాని, ప్రియాంక జంట మధ్య కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్. గ్యాంగ్ లీడర్ లో ఎలా కనిపించారో.. ఇందులో కూడా అంతే ముచ్చటగా కనిపించారు. కొత్తగా ప్రేమలో పడిన ప్రేమికులుగా కనిపించారు. నాని మెలోడీస్ లిస్ట్ లో మరొకటి  చేరిందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపొతే ఈ సినిమా ఆగస్టు 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×