E-Paper
Advertisement

Priyankaa Mohan: సూర్య గర్ల్ ఫ్రెండ్ చారు వచ్చేస్తోంది.. ఫ్యాన్స్ గెట్ రెడీ

Priyankaa Mohan: సూర్య  గర్ల్ ఫ్రెండ్ చారు వచ్చేస్తోంది..  ఫ్యాన్స్ గెట్ రెడీ
Advertisement

Priyankaa Mohan: గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది ముద్దుగుమ్మ ప్రియాంక అరుళ్ మోహన్. మొదటి సినిమాలోనే అమ్మడి అందానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా తరువాత కొన్ని సినిమాలు చేసింది కానీ, అంతగా గుర్తింపు రాలేదు. దీంతో తమిళ్ లో పాగా వేసింది. అక్కడ శివ కార్తీకేయన్, ధనుష్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక ఎప్పుడైతే ప్రియాంక.. OG లోకి వచ్చిందో స్టార్ హీరోయిన్ గా మారింది.

సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించే లక్కీ ఛాన్స్ ను పట్టేసింది. ఈ సినిమా తరువాత అమ్మడి రేంజ్ మారిపోయింది. ఎడిట్స్ లో కూడా పవన్ సరసన ఈ చిన్నదాన్ని వదలడం లేదు. ఈ మధ్యనే అలకనందగా అమ్మడి పేరును కూడా మార్చేశారు. ఇక ఈ సినిమా కాకుండా ప్రియాంక నటిస్తున్న మరో చిత్రం సరిపోదా శనివారం. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.

Advertisement

ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అంటే సుందరానికి సినిమా తరువాత నాని- వివేక్ నుంచి వస్తున్న కావడం ఒకటి అయితే.. గ్యాంగ్ లీడర్ కాంబో నాని- ప్రియాంక మరోసారి రిపీట్ కావడంతో సరిపోదా శనివారం కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ఇక ప్రతి శనివారం ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ తో ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వరుసగా సాంగ్, పోస్టర్స్ ను రిలీజ్ చేసి అదరగొడుతున్నారు. ఈ సినిమాలో నాని సూర్య అనే పాత్రలో నటిస్తున్నాడు అని ఇప్పటికే మేకర్స్ చెప్పుకొచ్చేశారు.

తాజాగా ఈ శనివారం.. చారును పరిచయం చేయనున్నట్లు తెలిపారు. ప్రియాంక మోహన్.. చారు పాత్రలో కనిపించనుంది. జూలై 7 అనగా రేపు సాయంత్రం 4.05 నిమిషాలకు చారు ఫస్ట్ లుక్ ను రివీల్ చేయనున్నారు. మరి చారు ఎలా ఉండబోతుందోచూడాలంటే రేపటివరకు ఆగాల్సిందే. ఇకపోతే ఈ సినిమ ఆగస్టు 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×