E-Paper
Advertisement

The Goat: సర్దార్ సినిమాకు రీమేక్ లా ఉందిగా బాసూ..

The Goat: సర్దార్ సినిమాకు రీమేక్ లా ఉందిగా బాసూ..
Advertisement

The Goat: దళపతి విజయ్- వెంకట్ ప్రభు కాంబోలో వస్తున్న చిత్రం ది గోట్. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. లియో సినిమా తరువాత విజయ్ నటించిన చిత్రం కావడంతో.. తెలుగులో ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. స్నేహ, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 5 న రిలీజ్ అవుతుంది.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. అందులో భాగంగా నేడు ది గోట్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లో విజయ్ యాక్షన్ బావున్నా.. కథ ఎక్కడో తేడా కొడుతోంది అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ట్రైలర్ చుస్తుంటే.. గతంలో కార్తీ హీరోగా తెరకెక్కిన సర్దార్ సినిమా గుర్తొస్తుందని చెప్పుకొస్తున్నారు.

Advertisement

కార్తీ సర్దార్ లో కూడా తండ్రీకొడుకులు.. తండ్రీ స్పై.. కొడుకు పోలీస్. ఇందులో కొద్దిగా మార్చి తండ్రీ స్పై అయితే కొడుకును వేరేవిధంగా చూపించారు. అందులో కార్తీ.. జైలుకు వెళ్లి చాలాకాలం తరువాత బయటకు వచ్చి ఆపరేషన్ ఫినిష్ చేస్తాడు. ఇందులో విజయ్ కూడా చాలా గ్యాప్ తరువాత వచ్చి మిషన్ ను ఫినిష్ చేస్తాడు. అందులో వన్స్ ఏ స్పై.. ఆల్ వేస్ ఏ స్పై అని ట్యాగ్ లైన్ ఇచ్చారు. సేమ్ ఇందులో వన్స్ ఏ లైన్ ఆల్ వేస్ ఏ లైన్ అని మార్చారు. అందులో సర్దార్ కు హెల్ప్ చేయడానికి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇందులో కూడా ఫ్రెండ్స్ ను పెట్టారు.

ఇలా ప్రతిదీ ఆ సినిమాకు కనెక్ట్ అయ్యేలా ఉండడంతో.. సర్దార్ కు రీమేక్ లా ఉంది అని పెదవి విరుస్తున్నారు. స్పై బ్యాక్ డ్రాప్ లో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉంటే.. లైన్ ఒకటే అయినా కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. మరి వెంకట్ ప్రభు.. సర్దార్ ను మించి ఈ కథను తెరకెక్కించాడా.. ? అనేది తెలియాలి అంటే.. సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×