E-Paper
Advertisement

Regina Cassandra : రెజినా వెనుక ఇంత కుట్ర జరిగిందా..? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..

Regina Cassandra : రెజినా వెనుక ఇంత కుట్ర జరిగిందా..? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..
Advertisement

Regina Cassandra : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు వరుసగా స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మధ్య అదృష్టం అంతగా బాగోలేదని తెలుస్తుంది. అడపాదడపా సినిమాలతో సరిపెట్టుకుంది. సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది. నిత్యం ఆమెకు స్టార్ హీరోలతో ఎఫైర్ పెట్టుకుందనే వార్తలు ఎక్కువగా వినిపించేవి. ఇక రెజినా మనసులో ఏది ఉన్నా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం. ఏదైనా డైరెక్ట్ గా మాట్లాడేస్తుంది. అది తన వ్యక్తిగత విషయమైనా ఆమె అలాగే రియాక్ట్ అవుతుంది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె డేటింగ్ విషయం పై ఒక క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పటికి ఈ విషయం పై నెగిటివ్ గా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే రెజినా గురించి తెలిసిన వారంతా ఆమె పై కుట్ర జరిగిందని చెబుతున్నారు. అసలు విషయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

రెజినా గతంలో ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె తన లైఫ్ గురించి సంచలన విషయాలను బయట పెట్టింది. ఎవరితో డేటింగ్ చెయ్యట్లేదని, ఇక పెళ్లి అనేది ఇప్పటిలో చేసుకొనని తెగేసి చెప్పేసింది. ఒకప్పుడు చాలా మందితో డేటింగ్ చేసినట్లు బయటపెట్టింది. ఆ వార్త ఇప్పుడు మరోసారి వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఎలాంటి డేటింగ్స్ లేవు.. బ్రేక్ తీసుకున్న అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఎప్పుడు ఇంత ముక్కుసూటితనంగా మాట్లాడడం కూడా తన మాజీ ప్రియులకు ఇబ్బంది కలిగించవచ్చు. కానీ నేను ఏ తప్పు చెయ్యలేదు. నచ్చితే డేటింగ్ చేశాను.. లేదంటే లైట్ అంతే. అంతకు మించి నేను ఎవరిని ఉద్దేశ్య పూర్వకంగా వాడుకోలేదని చెప్పింది. తన పై ఎవరో కుట్ర చేశారని ఆమె చెప్పడం విశేషం.. ఆ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Advertisement

ఇక రెజినా కేరీర్ విషయానికొస్తే.. శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా ఊహించిన రేంజ్ లో సక్సెస్ రాలేదు. తెలుగులో అవకాశాలు తగ్గడంతో తమిళ్, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండేది. ఇక తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీస్ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన సినిమాలు పర్వాలేదనే టాక్ ను అందుకున్నాయి.

తమిళ్, హిందీలో మాత్రం వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.. ఇక చాలాకాలం తర్వాత తెలుగులో నటించింది. ఆ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక తెలుగులో మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయని టాక్.. ఇక సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×